Tuesday, January 21, 2020

నా గీతం కర్ణాటక సంగీతం

చిత్రం :  అంకితం (1990)
సంగీతం :  యువరాజ్
గీతరచయిత :  సినారె
నేపథ్య గానం :  బాలు

పల్లవి :

హువ హువ హువ హువహువ...
రాములమ్మ గుడికాడ... హువహువా
రంగి కన్నుకొట్టింది.. హువహువా
చీకటేల రమ్మంది.. హువహువా
చీటి ఇచ్చి పోయింది... హువహువా
బాపురే హువా... అమ్మబాపురే హువా
బాపురే హువా... అయ్యబాపురే హువా ... హువా... హువా

నా గీతం కర్ణాటక సంగీతం
నా గీతం కర్ణాటక సంగీతం... నా బాణీ హిందుస్తానీ
కావాలంటే రాక్ రాక్... చేయాలంటే బ్రేక్ బ్రేక్
కావాలంటే రాక్ రాక్... చేయాలంటే బ్రేక్ బ్రేక్

కలుపుకుంటే... ఓ.. ఓ..
కలుపుకుంటే అదేరా ఓరబ్బీ.. అరబ్బీ.. అరబ్బీ... అరబ్బీ

నా గీతం కర్ణాటక సంగీతం...  

చరణం 1 :

చెవితో నాదం చవి చూడాలి... శ్రుతితో హృదయం జత కూడాలి
చెవితో నాదం చవి చూడాలి... శ్రుతితో హృదయం జత కూడాలి
చెవిని... చవిని... శ్రుతిని...  మతిని
చెవిని.. చవిని.. శ్రుతిని.. మతిని... కలిపే రసవత్కృతి
గానకళకే ఆగని పురోగతి
 
చరణం 2 :

సంగీతానికి ధనమా కులమా... సౌజన్యానికి మతమా గతమా
సంగీతానికి ధనమా కులమా... సౌజన్యానికి మతమా గతమా
మనసుని మనసుగ మనిషిని మనిషిగా మలిచే నవ సంస్కృతి
విశ్వకళకే చెరగని అలంకృతి....  

నా గీతం కర్ణాటక సంగీతం... నా బాణీ హిందుస్తానీ

No comments:

Post a Comment