Wednesday, January 22, 2020

సరి అంటే సరిగమలై

చిత్రం :  అంకితం (1990)
సంగీతం :  యువరాజ్
గీతరచయిత :  సినారె
నేపథ్య గానం : బాలు



పల్లవి :


సరి అంటే సరిగమలై... పద అంటే పదనిసలై
సరి అంటే సరిగమలై... పద అంటే పదనిసలై
పలికే స్వరముంటేనే పాటౌతుంది...
పలికే స్వరముంటేనే పాటౌతుంది...
అది శ్రుతిలో లేకుంటే పొరపాటౌతుంది


పాడనా... పాడనా... పాడనా
నా పాటా... 


చరణం 1 :


త్యాగయ్య కృతిలో తరగలించి... తాన్సేను శ్రుతిలో తానమాడి
త్యాగయ్య కృతిలో తరగలించి... తాన్సేను శ్రుతిలో తానమాడి
మోళ్ళకు జీవమై రాళ్ళకు రాగమై...
మోళ్ళకు జీవమై రాళ్ళకు రాగమై
గౌతమిలా గమకించే ఆ పాటా...

పాడనా... పాడనా... పాడనా
నా పాటా... 


చరణం 2 :


అన్నమయ్య గీతిలో అలరులు కురిసి... గోపన్న ఆర్తిలో గుండెలు తెరిచి
అన్నమయ్య గీతిలో అలరులు కురిసి... గోపన్న ఆర్తిలో గుండెలు తెరిచి
భక్తికి శిఖరమై రక్తికి అధరమై...
భక్తికి శిఖరమై రక్తికి అధరమై...
తిరుమలలా శిరసెత్తే ఆ పాటా

పాడనా... పాడనా... పాడనా
నా పాటా... 


సరి అంటే సరిగమలై... పద అంటే పదనిసలై
పలికే స్వరముంటేనే పాటౌతుంది...
అది శ్రుతిలో లేకుంటే పొరపాటౌతుంది
పాడనా... పాడనా... పాడనా
నా పాటా... 

No comments:

Post a Comment