Tuesday, January 21, 2020

సంగీత గంగా తరంగాలలో

చిత్రం :  అంకితం (1990)
సంగీతం :  యువరాజ్
గీతరచయిత :  సినారె
నేపథ్య గానం :  మంగళంపల్లి, బాలు



పల్లవి :


సంగీత గంగా తరంగాలలో...
సంగీత గంగా తరంగాలలో...  పొంగారు గళమే చరితార్ధం
స్వరమే శ్వాసగా పదమే ధ్యాసగా
స్వరమే శ్వాసగా పదమే ధ్యాసగా
పరవశించే జన్మదే పరమార్ధం


గగరిగగరిగ గరిగ రిగమగరిగ మగమమగమ మగదమగమ
దదదనినిని నినినిమమమ దదదనినిని మమమ గమదనిస మదనిసరి

 ఆ... ఆ... ఆ...ఆ...

సంగీత గంగా తరంగాలలో...  పొంగారు గళమే చరితార్ధం
సంగీత గంగా తరంగాలలో...  పొంగారు గళమే చరితార్ధం
స్వరమే శ్వాసగా పదమే ధ్యాసగా
స్వరమే శ్వాసగా పదమే ధ్యాసగా
పరవశించే జన్మదే పరమార్ధం 


చరణం 1 :


ఏటి గొంతులో పలికే గీతం...
ఏటి గొంతులో పలికే గీతం... ఎగిసి ఎగిసి ఆడే కెరటం
తోట గుండెలో తొణికే నాదం...
తోట గుండెలో తొణికే నాదం... తుళ్ళితుళ్ళి పాడె బ్రమరం
వనమైనా.. జీవనమైనా...
వనమైనా.. జీవనమైనా... అనుపమరాగలయాశ్రితం



సంగీత గంగా తరంగాలలో...  పొంగారు గళమే చరితార్ధం
స్వరమే శ్వాసగా...  పదమే ధ్యాసగా
స్వరమే శ్వాసగా...  పదమే ధ్యాసగా
పరవశించే జన్మదే పరమార్ధం


చరణం 2 :


మేఘవాణిలో మ్రోగే వాద్యం...
మేఘవాణిలో మ్రోగే వాద్యం... మెరిసిమెరిసి ఉరికే పాదం
గ్రహతారలలో కలిగే చలనం...
గ్రహతారలలో కలిగే చలనం... గగనజలధి మంగళమధనం
శ్రుతి ఐనా.. ఏ కృతి ఐనా... 
శ్రుతి ఐనా.. ఏ కృతి ఐనా... సురుచిరభావసుశోభితం 


సంగీత గంగా తరంగాలలో...  పొంగారు గళమే చరితార్ధం
స్వరమే శ్వాసగా...  పదమే ధ్యాసగా
స్వరమే శ్వాసగా...  పదమే ధ్యాసగా
పరవశించే జన్మదే పరమార్ధం

No comments:

Post a Comment