Monday, February 3, 2020

అందుకే కొడతుండ డప్పు

చిత్రం :  అంకుశం (1989)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  మల్లెమాల
నేపథ్య  గానం : బాలు 


పల్లవి :


అయ్యలూ జాగరత్తా... అమ్మలూ జగరత్తా
కళ్ళుండి కొందరు లోకాన్ని సూడరు..
కాళ్ళుండి కొందరు కదలనే కదలరు


అందుకే కొడతుండ డప్పు... ఇప్పుడేనా తెలుసుకోండి తప్పు
అందుకే కొడతుండ డప్పు... ఇప్పుడేనా తెలుసుకోండి తప్పు..ఓయ్...


చరణం 1 :


కోడిపిల్లను గ్రద్ధా ఎగరేసుకెళినట్టు
పేదోడ్ని పెద్దోడు దోసుకుంటున్నాడు
సీమెలెట్టిన పుట్టా.. పాము సొరబడ్డట్టు
కోటగట్టేదొకడు.. కొలువు తీరేదొకడు


ఈ కుళ్ళు తెలుసుకొని నీ కళ్ళు తెరవమని
ఈ కుళ్ళు తెలుసుకొని నీ కళ్ళు తెరవమని
ఎలుగెత్తి సెప్పాడు... ఎప్పుడో ఎలమందా


అందుకే కొడతుండ డప్పు... ఇప్పుడేనా తెలుసుకోండి తప్పు
అరెరెరే...
అందుకే కొడతుండ డప్పు... ఇప్పుడేనా తెలుసుకోండి తప్పు..



చరణం 2 :


తెల్లోళ్ళు ఆనాడు తేరగా దేశాన్ని కొల్లగొట్టారని ఎల్లగొట్టేశాము
మనవోళ్ళు గద్దెక్కి మన కడుపు కొడతంటే గుడ్లప్పగించేసి గుటకలేస్తున్నాము


ఈ పీడ వదిలించి...  లోపాలు తొలిగించి
ఈ పీడ వదిలించి...  లోపాలు తొలిగించి
న్యాయాన్ని నిలబెట్టే నాయకుడు రావాలి...


అందుకే కొడతుండ డప్పు... ఇప్పుడేనా తెలుసుకోండి తప్పు
అ....
అందుకే కొడతుండ డప్పు... ఇప్పుడేనా తెలుసుకోండి తప్పు..
తప్పు..తప్పు..తప్పు..



No comments:

Post a Comment