Monday, February 10, 2020

శివరాత్రి చలిగాలి జవరాలిని అడిగింది

చిత్రం :  అత్తగారి పెత్తనం (1981)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  జాలాది
నేపథ్య గానం :  బాలు, సుశీల  



పల్లవి : 


శివరాత్రి చలిగాలి జవరాలిని అడిగింది
విడివిడిగా పడుకుంటే వడగాలై తగిలింది
తగ్లాటం తలుపేసిందే చందమామా
ఉబలాటం ఊపేస్తోందే చందమామా
అవును... ఉబలాటం ఊపేస్తోందే చందమామా



శివరాత్రి చలిగాలి జవరాలిని అడిగిందా
విడివిడిగా పడుకుంటే వడగాలై తగిలిందా
గారాబం గారెలు వేపకు చందమామా
మిరియాల కారం నూరకు చందమామా
హోయ్... మిరియాల కారం నూరకు చందమామా



చరణం 1 :


ఆరుబయట చుక్కలు మేసి కుక్కలు మొరిగిన చంద్రమ్మో
అరుగు మీద పక్కలు వాచి అల్లుడు అరచెను బుల్లెమ్మో
ఏడమలా నడిచొచ్చానే ఏటికి ఎదురు ఈదొచ్చానే
చదన్నం తిన్న అమ్మా మొగుడాకలి ఎరగాలమ్మా 


ఏడడుగులు నేనూ నడచా ఏడాదిగా నిన్నే వలచా
ఏడడుగులు నేనూ నడచా ఏడాదిగా నిన్నే వలచా
అర్ధరాతిరి మద్దెల దరువు వద్దయ్యో.. పోతది పరువు


శివరాత్రి చలిగాలి జవరాలిని అడిగింది
విడివిడిగా పడుకుంటే వడగాలై తగిలింది


గారాబం గారెలు వేపకు చందమామా
మిరియాల కారం నూరకు చందమామా..మా..మా..మా..మా
మిరియాల కారం నూరకు చందమామా 



చరణం 2 :


మాయలేడి నాటకమాడి మాటలు చెప్పకు మావయ్యో
మంత్రాలకు మంచం వాల్చే మగువల కాలం కాదయ్యో
కావాలనే కారడవులకే కాంతలు వెళ్ళారానాడు
సాఫీగా సంసారాలను సర్ధుకుపోవాలన్నారు 


నమ్మి నానబోశానయ్యో... ఉలికి బూరెలయ్యిందయ్యో
ఇల్లు చూడమంటే లేదూ.. ఇల్లెక్కి కూస్తాడయ్యో
ఈ పూటకు సర్దుకుపోవే రేపే గది లేపేస్తానే



శివరాత్రి చలిగాలి జవరాలిని అడిగిందా
విడివిడిగా పడుకుంటే వడగాలై తగిలిందా
గారాబం గారెలు వేపకు చందమామా
మిరియాల కారం నూరకు చందమామా
హోయ్... మిరియాల కారం నూరకు చందమామా


శివరాత్రి చలిగాలి జవరాలిని అడిగింది
విడివిడిగా పడుకుంటే వడగాలై తగిలింది
తగ్లాటం తలుపేసిందే చందమామా
ఉబలాటం ఊపేస్తోందే చందమామా
అవును... ఉబలాటం ఊపేస్తోందే చందమామా





No comments:

Post a Comment