Friday, February 7, 2020

అమ్మ పిలుపు నోచని వాడు

చిత్రం :  అంకుశం (1989)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  మల్లెమాల
నేపథ్య గానం : బాలు



పల్లవి :

అమ్మ పిలుపు నోచని వాడు... నాన్న పేరే తెలియని వాడు
ఎవరో ఇద్దరి క్షణిక సుఖానికి చేదు గుర్తుగా మిగిలినవాడు
పురిటి నెత్తురు ఆరక ముందే మురికి గుంటకు చేరినవాడు 


అమ్మ పిలుపు నోచని వాడు... నాన్న పేరే తెలియని వాడు


చరణం 1 :


తోడు నీడా రెండూ లేకా... నీడే తోడుగ నిత్యం పెరిగే
అసంఖ్యాకులో అనాధబాలల ఆక్రందనలకు అతడే చిహ్నం
అక్కున చేర్చే దిక్కు లేదని... ఆకలూరుకోదు
ఆకలి బధను మించిన నరకం లోకమందులేదు
ఇపుడే ఎముకల బీడుగ మారిన వీరా జాతికి వారసులు
నవభారత రథసారధులు...  



No comments:

Post a Comment