Friday, February 7, 2020

చట్టాలను దిక్కరిస్తు

చిత్రం :  అంకుశం (1989)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  మల్లెమాల
నేపథ్య గానం : బాలు



పల్లవి :


నో.. నేను తప్పు చేయలేదు...
చట్టాలను దిక్కరిస్తు... సమాజాన్ని  వెక్కిరిస్తు
హద్దుమీరి ప్రవర్తించు అహంకార మదగజం...
దళితజనుల గుండెలపై దండయాత్ర చేస్తుంటే
చూడలేని మానవత... తుళ్ళు విరిగి ఒళ్ళు విరిచి
అయినది తానంకుశం...  అయినది తానంకుశం...
అయినది తానంకుశం...  అయినది తానంకుశం...



చరణం 1 :


చాటునుండి చంపలేదా వాలిని శ్రీరాముడు
అయినా లోకాన తాను కాలేదా దేముడు
ధర్మరక్షణార్ధమనే పేరుతో కృష్ణుడు
చేయించిన తప్పులన్నీ పొందలేదా మెప్పులు


ఆ నాటి ఆ ధర్మం అదే నాకు ఆదర్శం
నీతిలేని వాళ్ళకు మేకవన్నె పులులకు
నేనే ఒక అంకుశం... నేనే ఒక అంకుశం... 
 



చరణం 2 :


ఇప్పటిదా చీకటితో దీపానికి వైరం...
ఇంతటితో ఆగదు ఇది అంతులేని సమరం
చెలరేగిన కక్షతో చేస్తున్న శపద్ధం..
ప్రాణమైన అర్పిస్తా ప్రజారక్ష కోసం


విధినైనా ఎదిరించి సాదిస్తా లక్ష్యం
కాలం శాసించినా... క్రౌర్యం గర్జించినా
జంకదు ఈ అంకుశం... జంకదు ఈ అంకుశం...
జంకదు ఈ అంకుశం... జంకదు ఈ అంకుశం... 



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=13141

No comments:

Post a Comment