Sunday, February 9, 2020

ఓ యబ్బో నా పుణ్యం కొద్ది

చిత్రం :  అత్తగారి పెత్తనం (1981)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  జాలాది
నేపథ్య గానం :  బాలు, సుశీల  

పల్లవి : 

ఓ యబ్బో...  ఓ యబ్బో...
నా పుణ్యం కొద్ది పురుషుడు దొరికాడే
యబ్బ పురుషుడు దొరికాడే... భలే భలే పుసుకుడు దొరికాడే
మొగలిపువ్వురా మగడా అంటే... మోటుగ తుడి చేశాడే
మొగలిపువ్వురా మగడా అంటే... మోటుగ తుడి చేశాడే

ఓ యబ్బో...  ఓ యబ్బో...
నా ఖర్మం చాలక పెళ్ళాం దొరికింది...
ఇత్తడి పళ్ళెం దొరికింది... భలే భలే గొళ్ళెం దొరికింది
దొంగలపోతే మంగళ మొకటి చేతికి చిక్కింది
దొంగలపోతే మంగళ మొకటి చేతికి చిక్కింది

చరణం 1 :

గట్టిగ నోట్లో వేలు పెట్టినా కొరకలేని వాడే
బొత్తిగ చురుకు లేని వాడే... ఒయమ్మో సరుకు లేని వాడే
గట్టిగ నోట్లో వేలు పెట్టినా కొరకలేని వాడే
బొత్తిగ చురుకు లేని వాడే... ఒయమ్మో సరుకు లేని వాడే 

కొండీ విప్పి కుట్టకపోతే కుమ్మరపురుగని అంటారు
కొండీ విప్పి కుట్టకపోతే కుమ్మరపురుగని అంటారు
కుడితే తేలని అంటారు... కుక్కిన పేనుగ ఉంటారు

ఓయబ్బో.. ఏమ్మా...నా పుణ్యం కొద్ది పురుషుడు దొరికాడేయబ్బ పురుషుడు దొరికాడే... భలే భలే పుసుకుడు దొరికాడే

దొంగలపోతే మంగళమొకటి చేతికి చిక్కింది... నా ఖర్మదొంగలపోతే మంగళమొకటి చేతికి చిక్కింది

చరణం 2 :

చూస్తే ఆకలి తీరేటట్టు ఒడ్డుపొడుగు ఉన్నాడే...
ఎద్దును చూస్తే ముచ్చట... వ్యవసాయం చూస్తే కటకట
చూస్తే ఆకలి తీరేటట్టు ఒడ్డుపొడుగు ఉన్నాడే...
ఎద్దును చూస్తే ముచ్చట... వ్యవసాయం చూస్తే కటకట
నిన్నూ... వెవెవె...

అనుభవమ్ములో చూస్తే కానీ ఔషధమ్ము పస తెలియదే
అనుభవమ్ములో చూస్తే కానీ ఔషధమ్ము పస తెలియదే
తాడో పేడో తేలదే... అందాక నోరు ఆగదే

ఓయబ్బో... యబ్బా...
ఓ యబ్బో... నా పుణ్యం కొద్ది పురుషుడు దొరికాడే
యబ్బ పురుషుడు దొరికాడే... భలే భలే పుసుకుడు దొరికాడే
మొగలిపువ్వురా మగడా అంటే... మోటుగ తుడిచేశాడే
మొగలిపువ్వురా మగడా అంటే... మోటుగ తుడిచేశాడే

ఓ యబ్బో...  ఓ యబ్బో...
నా ఖర్మం చాలక పెళ్ళాం దొరికింది...
ఇత్తడి పళ్ళెం దొరికింది... భలే భలే గొళ్ళెం దొరికింది
దొంగలపోతే మంగళమొకటి చేతికి చిక్కింది
దొంగలపోతే మంగళమొకటి చేతికి చిక్కింది

ఓయబ్బో.. ఓయమ్మా
ఓయబ్బో... ఓయమ్మా

No comments:

Post a Comment