Monday, February 10, 2020

ఏటిగాలి చూశాను

చిత్రం :  అత్తగారి పెత్తనం (1981)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  జాలాది
నేపథ్య గానం :  బాలు, సుశీల  

పల్లవి : 

ఏటిగాలి చూశాను... నీటిగాలి చూశాను
ఎండగాలి చూశాను... వానగాలి చూశాను
అయ్యబాబోయ్..
ఈ ఆడగాలి తగిలింది బాబోయ్... గుండె అల్లాడిపోతోంది నాయనోయ్
ఈ ఆడగాలి తగిలింది బాబోయ్... గుండె అల్లాడిపోతోంది నాయనోయ్

కొండగాలి చూశాను... కొంటెగాలి చూశాను
పైరగాలి చూశాను.. పైటగాలి చూశాను
అయ్యబాబోయ్...
ఈ కుర్రగాలి తగిలింది బాబోయ్...నా కొంగు నిలవనంటోంది దేవుడో
ఈ కుర్రగాలి తగిలింది బాబోయ్...నా కొంగు నిలవనంటోంది దేవుడో

చరణం 1 :

ఇంత రివ్వ గాలికే గొంతుకారితే...
చింతపులుపు తగిలినట్టు చెర్రలాడితే..
ఊపిరాగిపోతుందే పిల్లో...ఆ  ప్రేమంటే ఇంతేనే బుల్లో... 

పిల్లగాలి దెబ్బకే గుల్లబారితే...
ఉల్లికాడ వాడినట్టు నేలకొరిగితే
మల్లెపూల పానుపుంది ఓరయ్యో... నిన్ను మత్తుచిత్తు చేస్తది మావయ్యో

ఆ మత్తైనా చిత్తైనా కొత్తగానే ఉన్నాది

కొండగాలి చూశాను... కొంటెగాలి చూశాను
ఎండగాలి చూశాను... వానగాలి చూశాను
అయ్యబాబోయ్...
ఈ కుర్రగాలి తగిలింది బాబోయ్... గుండె అల్లాడిపోతోంది నాయనోయ్

చరణం 2 :

పైరగాలి దెబ్బకే మైకమెక్కితే... సంకురాతిరిరొచ్చినట్టు సంకలాడితే
బోలెడంత జాతరుంది ఓరయ్యో... ఆ భోగిమంటలు లెయ్యర మావయ్యో 

భోగిమంటలేసినా వదలనంటది... తీగమేసినట్టు గుండె బిగుసుకుంటది
తెల్లారేదెల్లాగే పిల్లో... ఒల్లు చల్లారెదెల్లాగే బుల్లో...
ఈడుకోడి కుయ్యాలా.. పొద్దు ముద్దులాడాలా

ఏటిగాలి చూశాను... నీటిగాలి చూశాను
ఎండగాలి చూశాను... వానగాలి చూశాను
అయ్యబాబోయ్.. అయ్యబాబోయ్..

1 comment: