Saturday, April 11, 2020

ఎదటికొస్తే నవ్వులు

చిత్రం : అమృత కలశం  (1980)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వీటూరి
నేపథ్య గానం : బాలు, శైలజ 

పల్లవి : 

హ..ఆ.. హ.. ఆ...ఆ.. హ.. ఆ...
ఎదటికొస్తే నవ్వులు... ఎనక జూస్తే పువ్వులు
ఎవరమ్మా.... ఆ.. ఆ... హా
నవ్వులపువ్వుల గువ్వలాంటి చిన్నది.. రివ్వురివ్వుమన్నది

ఎండలాంటి చూపులు... ఎన్నెలంటి నవ్వులు
ఎవరమ్మా... ఆ... ఆ.. హా
మల్లెల మబ్బుల జల్లులాంటి చిన్నోడు... జివ్వుజివ్వుమన్నాడు
 
చరణం 1 :

చూపు సుప్రభాతం... మాట మలయమారుతం
కొంగుచాటు కవితగా... పొంగుతున్న సాగరం
నవ్వుతున్న జవ్వనం...  నడుస్తున్న నందనం

ఎవరమ్మా.. ఆ.. హా..
అందాలన్నీ గ్రంథాలల్లి... అభివర్ణించే కవికుమారుడు

ఎదటికొస్తే నవ్వులు... ఎనక జూస్తే పువ్వులు

చరణం 2 :

చూపు నాకు చుంభనం... వలపు సేతుబంధనం
కౌగిలింత బిగువులో...  వణకుతున్న ఆకసం
గడుస్తున్న పొద్దులో... పొడుస్తున్న తారలం

ఎవరమ్మా... ఆ..
ఎన్నో జన్మల బంధం తానై నన్నల్లుకునే రాగమాలిక

ఎండలాంటి చూపులు... ఎన్నెలంటి నవ్వులు
ఎవరమ్మా... ఆ... ఆ.. హా
మల్లెల మబ్బుల జల్లులాంటి చిన్నోడు... జివ్వుజివ్వుమన్నాడు

ఎదటికొస్తే నవ్వులు... ఎనక జూస్తే పువ్వులు
ఎవరమ్మా.... ఆ.. ఆ... హా
నవ్వులపువ్వుల గువ్వలాంటి చిన్నది.. రివ్వురివ్వుమన్నది

జివ్వుజివ్వుమన్నాడు... రివ్వురివ్వుమన్నది

https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8105

No comments:

Post a Comment