Saturday, April 18, 2020

ప్రాణాన్నే పసుపుగా

చిత్రం:  అనాదిగా ఆడది (1985)
సంగీతం:  సత్యం
గీతరచయిత:  వేటూరి
నేపథ్య గానం:  జానకి 


సాకీ :


తోడు కావాలని బ్రహ్మ... సృజియించే స్త్రీమూర్తిని
బ్రహ్మముళ్ళతో చెరిసగంగా...  కలిసి బ్రతకమన్నాడు
బ్రహ్మముళ్ళతో చెరిసగంగా...  కలిసి బ్రతకమన్నాడు



పల్లవి :


ప్రాణాన్నే పసుపుగా... రక్తాన్నే కుంకుమగా
ప్రాణాన్నే పసుపుగా... రక్తాన్నే కుంకుమగా
పంచి ఇచ్చు ప్రకృతిరా ఆడది
మన ఆకృతికే ఆలయం ఆడది
మన ఆకృతికే ఆలయం ఆడది


అయినా... అనాదిగా ఆడదానికి ఙరుగుతున్నదేమిటి?


చరణం 1 :


దేముడన్న రామన్న వడేలన్న మాట విని
నమ్ముకున్న సీతమ్మను అడవి పాల్చేసినా..
శీలవతి సీతమ్మ తలవంచెను కానీ..
శీలవతి సీతమ్మ తలవంచెను కానీ..
నోరు విప్పలేదు... ఇది దారుణ మనలేదు
దారుణ మనలేదు..


ప్రాణాన్నే పసుపుగా... రక్తాన్నే కుంకుమగా
ప్రాణాన్నే పసుపుగా... రక్తాన్నే కుంకుమగా
పంచి ఇచ్చు ప్రకృతిరా ఆడది
మన ఆకృతికే ఆలయం ఆడది
మన ఆకృతికే ఆలయం ఆడది


చరణం 2 :



హరిశ్చద్రుడంతటోడు కీర్తిపెంచుకోనూ... ఆలి చంద్రమతిని వీధిలో తెగనమ్మినా
పతి మాటను జవదాటక అమ్ముడాయే గానీ
పతి మాటను జవదాటక అమ్ముడాయే గానీ
నోరు విప్పలేదు.. ఇది దారుణమనలేదు... దారుణమనలేదు


ప్రాణాన్నే పసుపుగా... రక్తాన్నే కుంకుమగా
పంచి ఇచ్చు ప్రకృతిరా ఆడది
మన ఆకృతికే ఆలయం ఆడది
మన ఆకృతికే ఆలయం ఆడది



చరణం 3 :


సహగమనం పేరుతో సజీవంగా కాల్చారు...
కన్యాశుల్కం పేరుతో కన్నెలనే అమ్మారు...
బాల్యవివాహాలతో వితంతువుల చేశారు...
తరతరాలు ఆడదాన్ని అన్యాయమే చేశారు...


ఇంత చేసినా... ఇన్ని చేసినా...
ఓరిమితో సహించింది... కూరిమితో భరించింది


కానీ.. అనాగరికతకు అమానుషానికి మారుపేరైన కట్నం
స్త్రీ జాతిని చితిపై పేర్చి కాల్చుకు తిను వరకట్నం
మనిషిని మనిషే కొని కట్టుకొనే సిగ్గుమాలినా కట్నం
పెళ్ళికి కట్నం... పండుగ కట్నం... చదువుకు కట్నం... ఉద్యోగ కట్నం
కట్నం.. కట్నం.. కట్నం...
ఎన్ని కన్నీళ్ళకైనా ఆరని కాష్టం...
భరించేది ఇంకెన్నాళ్ళు... 


బ్రహ్మ కోరినా సగభాగంగా ఆడది మారేదెప్పుడూ?
ఈ భార్యభర్తల తులాభారం సమానమయ్యేదెప్పుడు?
ఎప్పుడు... ఎప్పుడు... ఎప్పుడు...

No comments:

Post a Comment