Thursday, May 7, 2020

ముత్యాల ఏటిలో

చిత్రం : పగడాల పడవ (1979)
సంగీతం : ఘంటసాల విజయ్ కుమార్
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం : సుశీల 



పల్లవి : 


ముత్యాల ఏటిలో పగడాల పడవా
ముత్యాల ఏటిలో పగడాల పడవా
పగడాల పడవలో బంగారు పిల్లా...


ఆ పిల్ల పాడింది అందాల పాట
ఆ పాట పలికింది అందరి నోటా


ముత్యాల ఏటిలో పగడాల పడవా... పగడాల పడవా



చరణం 1 :


పొంగింది వయసు దూకింది మనసు... ఏదో కోరిక ఉంది
ఈ లేత సొగసు దోచేటి రాజు కావాలంటూ ఉంది
పొంగింది వయసు దూకింది మనసు... ఏదో కోరిక ఉంది
ఈ లేత సొగసు దోచేటి రాజు కావాలంటూ ఉంది


ఈ ఒంటిదాన్ని ఏ కొంటెగాడో కవ్వించాలని ఉంది
సుడిగాలిలాగా సెలయేటిలాగా పరిగెట్టాలని ఉంది


ముత్యాల ఏటిలో పగడాల పడవా... పగడాల పడవా 



చరణం 2 :


ఈ తోట నాది... ఈ బాట నాది... ఈ లోకం నాదేలే
ఈ పూలు నావి... ఆ పళ్ళు నావి... ఈ అందం నాదేలే
ఈ తోట నాది... ఈ బాట నాది... ఈ లోకం నాదేలే
పూలన్నీ నావి... పళ్ళన్నీ నావి... అందాలు నావేలే


రివ్వున ఎగిరే ఆ గువ్వతోటి పోటీ చేసేను
కౌగిలిలోనా ఉయ్యాలలూగి కరిగించేసేను... నే కరిగించేసేను


ముత్యాల ఏటిలో పగడాల పడవా
పగడాల పడవలో బంగారు పిల్లా...
ముత్యాల ఏటిలో పగడాల పడవా... పగడాల పడవా




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7371

No comments:

Post a Comment