Sunday, May 10, 2020

ఎన్ని ఎన్ని ముద్దులున్నవి




చిత్రం : బ్రతుకే ఒక పండుగ (1977)
సంగీతం : కె. వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం : బాలు, సుశీల 



పల్లవి : 


ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని ముద్దులున్నవి
అన్ని అన్నీ నిన్నే కోరి కాచుకున్నవి
ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని ముద్దులున్నవి
అన్ని అన్నీ నిన్నే కోరి కాచుకున్నవి


మూటగట్టీ తెచ్చానూ కన్నెముద్దులు...
ఆ ముడివిప్పీ చూడనీ ముద్దుమూటలు


ఆ... ముందుకొస్తే ఎందుకో ఇన్నీ సిగ్గులు
నా ఒడిలోనా పూయనీ సిగ్గుమొగ్గలు


ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని ముద్దులున్నవి
అన్ని అన్నీ నిన్నే కోరి కాచుకున్నవి
ఎన్ని ఎన్ని... అన్ని అన్నీ
ఎన్ని ఎన్ని... అన్ని అన్నీ


చరణం 1 :



చూపుచూపు విసిరింది చురకంటి ముద్దు
నీ చిగురు పెదవి ఎరుపులో వగరైన ముద్దు
చూపుచూపు విసిరింది చురకంటి ముద్దు
నీ చిగురు పెదవి ఎరుపులో వగరైన ముద్దు 


కొంటెతనంలో ఉందీ వెంటాడేముద్దు
కొంటెతనంలో ఉందీ వెంటాడేముద్దు
నీ గుండెలో దాగుందీ ఉండిపొమ్మనే ముద్దు


ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని ముద్దులున్నవి
అన్ని అన్నీ నిన్నే కోరి కాచుకున్నవి
ఎన్ని ఎన్ని... అన్ని అన్నీ
ఎన్ని ఎన్ని... అన్ని అన్నీ


చరణం 2 :


గాలీలో ఒక ముద్దు... గప్ చుప్ గా ఒక ముద్దు
గలగలా నవ్వుల్లో కలిపేసేదొక ముద్దు
గాలీలో ఒక ముద్దు... గప్ చుప్ గా ఒక ముద్దు
గలగలా నవ్వుల్లో కలిపేసేదొక ముద్దు


కోరుకునేదొక ముద్దు... కొసరుకునేదొక ముద్దు
కోరుకునేదొక ముద్దు... కొసరుకునేదొక ముద్దు
కొంగుచాటు చేసుకొని... గుంజుకునేదొక ముద్దు


ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని ముద్దులున్నవి
అన్ని అన్నీ నిన్నే కోరి కాచుకున్నవి
ఎన్ని ఎన్ని... అన్ని అన్నీ
ఎన్ని ఎన్ని... అన్ని అన్నీ



చరణం 3 :


పెళ్ళినాడు ఓరచూపు కళ్ళకు తొలిముద్దు
గిల్లిపెట్టి నవ్వుకునే అల్లరికి మలిముద్దు
పెళ్ళినాడు ఓరచూపు కళ్ళకు తొలిముద్దు
గిల్లిపెట్టి నవ్వుకునే అల్లరికి మలిముద్దు


వగలుపోవు తొలిరేయి సొగసులకు కసిముద్దు
వగలుపోవు తొలిరేయి సొగసులకు కసిముద్దు
పగలంతా ఎలాగని దిగులుకు కడముద్దు


ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని ముద్దులున్నవి
అన్ని అన్నీ నిన్నే కోరి కాచుకున్నవి
ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని ముద్దులున్నవి
అన్ని అన్నీ నిన్నే కోరి కాచుకున్నవి


ఎన్ని ఎన్ని... అన్ని అన్నీ
ఎన్ని ఎన్ని... అన్ని అన్నీ



No comments:

Post a Comment