Monday, May 11, 2020

పడ్డావటే పిల్లా పడ్డావటే

చిత్రం : బ్రతుకే ఒక పండుగ (1977)
సంగీతం : కె. వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం :  సుశీల, వసంత  

పల్లవి :  

పడ్డావటే పిల్లా పడ్డావటే... పడకపడక ప్రేమలో పడ్డావటే

పడ్డ పిదప దాని రుచి తెలిసిందటే...
పడకముందు ఉన్న బిగువు సడలిందటే

చరణం 1 :

సొరకాయ కోతలెన్నో కోసావే... మగవాడి ఊసు నాకు వద్దన్నావే

వద్దన్నా ఆగలేదే వలపన్నది...
వద్దన్నా ఆగలేదే వలపన్నది...
వలపన్నది అగ్గిలాంటిది... అంటుకుంటే ఎవ్వరూ ఆపలేనిది

పడ్డావటే పిల్లా పడ్డావటే... పడకపడక ప్రేమలో పడ్డావటే

చరణం 2 :

చదువులెన్ని చదివినా ఆడదాడదే... అది ఏనాడు ఒకనాడు మగవాడిదే

ఇది చదువుల్లో ఎక్కడా చెప్పలేదే...
ఇది చదువుల్లో ఎక్కడా చెప్పలేదే...
చెప్పంది చేసినా తప్పుకాదే... ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ..

పడ్డావటే పిల్లా పడ్డావటే... పడకపడక ప్రేమలో పడ్డావటే

చరణం 3 :

పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదులే... పడ్డప్పుడు నవ్వనాళ్ళు పగవాళ్ళులే

నవ్విన నాపచేను పండుతుందిలే...
నవ్విన నాపచేను పండుతుందిలే...
పండుతుందిలే మనసూ నిండుతుందిలే...
ముందు ముందూ ముసళ్ళ పండగుందిలే

పడ్డావటే పిల్లా పడ్డావటే... పడకపడక ప్రేమలో పడ్డావటే
పడ్డ పిదప దాని రుచి తెలిసిందటే...
పడకముందు ఉన్న బిగువు సడలిందటే

పడ్డావటే పిల్లా పడ్డావటే... పడకపడక ప్రేమలో పడ్డావటే

https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7375

No comments:

Post a Comment