Saturday, May 30, 2020

సూరీడు పంపేను

చిత్రం : పుత్తడి బొమ్మ (1983)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత :
నేపథ్య గానం :  బాలు 




పల్లవి : 


సూరీడు పంపేను చిగురాకు పల్లకి
సందురూడు దింపేను కలవపూల పందిరి
ఆ పల్లకిలో ఓ దేవుడొస్తాడు...
ఈ పందిరిలో నీ రాముడౌతాడు... శ్రీరాముడౌతాడు


చరణం 1 :


మము గన్న తల్లి శ్రీదేవి నీదయ్యా
కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు... కనకాభిషేకాలు
పదిలంగ చూడు...
ఈ పచ్చతోరణం నట్టింట నిలబడితే
నిత్యకల్యాణం...  నిత్యకల్యాణం


సూరీడు పంపేను చిగురాకు పల్లకి
సందురూడు దింపేను కలవపూల పందిరి


చరణం 2 :


పాలకడలి సామీ... నీ నుదుటి సిందూరం
ఈ పుత్తడిబొమ్మే...
ఈ పుత్తడిబొమ్మే... నీ కొంగుబంగారం
పై యేటికి మీ ఒడిలో గుమ్మెడు పారాడాలా
ఈ గుండెపొంగి...
ఈ గుండెపొంగి... పండగై జోలపాడాలా... జోలపాడాలా


సూరీడు పంపేను చిగురాకు పల్లకి
సందురూడు దింపేను కలవపూల పందిరి
ఆ పల్లకిలో ఓ దేవుడొస్తాడు...
ఈ పందిరిలో నీ రాముడౌతాడు... శ్రీరాముడౌతాడు

No comments:

Post a Comment