Thursday, May 28, 2020

వారానికి ఏడు రోజులు

చిత్రం : ఆడంబరాలు-అనుబంధాలు (1974)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం : సుశీల, బాలు 



పల్లవి :


ఆషాడమాసానా... ఆకాశతీరాన
అడుగులో అడుగిడి... అంతలో తడబడి
నీలాల ఓ..మేఘమాలికా 



వారానికి ఏడు రోజులు ఎందుకనీ
రోజుకు ఇన్నిఝాములు ఎందుకనీ
చెప్పవే చెప్పవే... చెప్పవే..
నా మాట...మావారితో
చెప్పవే.. నా మాట మావారితో
వేరెవ్వరూ లేని..వేళలో..ఆ వేళలో.. 


చెప్పవే.. . నా మాట నా చెలియతో
వేరెవ్వరూ లేని..వేళలో..ఆ వేళలో..
చెప్పవే నామాట..నా చెలియతో..ఓ.. ఓ 



చరణం 1 :



మగత నిదురలో నేనుంటే
నా మదిలో మెదిలేది తానేననీ

మగత నిదురలో నేనుంటే
నామదిలో మెదిలేది తానేననీ


కలవరపడి నే నెటు చూసినా
కలకల నవ్వేది తానేననీ
కొలిచే దేవుని రూపంలో.. నిలిచే దేవుడు తానేననీ.. 


చెప్పవే చెప్పవే..నామాట మావారితో.. 


చరణం 2 : 



మల్లెలోనీ తెల్లదనం... తన మనసులోనే చూశాననీ
మల్లెలోనీ తెల్లదనం... తన మనసులోనే చూశాననీ
ఆ మనసులోనీ మంచితనం... తన కనులలోనే చూశాననీ


అందానికీ అనురాగానికీ...
అందానికీ అనురాగానికీ... అవధులు తనలోనే చూశాననీ.. 


చెప్పవే చెప్పవే చెప్పవే నామాట..నా చెలియతో
వేరెవ్వరూ లేని వేళలో... ఆ వేళలో
చెప్పవే నామాట  మావారితో.. 




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3130 

No comments:

Post a Comment