Sunday, May 31, 2020

ఎవరీ నవరాగమాలిక

చిత్రం : పుత్తడి బొమ్మ (1983)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత :
నేపథ్య గానం : బాలు, సుశీల 




పల్లవి : 


ఎవరీ నవరాగమాలిక...
ఎవరీ నవరాగమాలిక...
నా అంతరంగ నవరంగ వల్లిక
ఎవరీ నవరాగమాలిక... 


ఈ మాలిక వాసకసజ్జిక
ఈ వల్లిక స్వాధీనపతిక


ఎవరీ నవరాగమాలిక...


చరణం 1 :


నీ నీలనయనాల బిడియాలు... నిలిపేను మీనాలగాలు
నీ నీలనయనాల బిడియాలు... నిలిపేను మీనాలగాలు
చుక్కల రథానికే కొలువు... నీ చెక్కిల్ల పారాడు చిరునవ్వు
ఆ పాదాలపారాణి అల్లికలు... పరిచేను నాగమల్లికలు
పరిచేను నాగమల్లికలు


ఎవరీ నవరాగమాలిక...
నా అంతరంగ నవరంగ వల్లిక
ఎవరీ నవరాగమాలిక... 


చరణం 2 :


బిడియాల మందార హారాలు... నీ హృదయానికే ఉపహారాలు
బిడియాల మందార హారాలు...
చెలి చెక్కిలి హాసాల సేద్యాలు.. నీ ముద్దుకే నైవేద్యాలు
నా పారాణిపాదాల గమనాలు... నీ పూజకై చేరు కమలాలు
నీ పూజకై చేరు కమలాలు


ఎవరీ నవరాగమాలిక...
నా అంతరంగ నవరంగ వల్లిక
ఎవరీ నవరాగమాలిక... 



ఈ మాలిక అనురాగ మాలిక
ఈ వల్లిక ఆనందవల్లిక


ఎవరీ నవరాగమాలిక... 

No comments:

Post a Comment