Sunday, May 31, 2020

వేళచూడ వెన్నెలాయె

చిత్రం : నాటకాల రాయుడు (1969)
సంగీతం : జి.కె. వెంకటేశ్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : సుశీల

పల్లవి :

వేళ చూడ వెన్నెలాయె... లోన చూడ వెచ్చనాయె
ఎందుకోమరి తెలియదాయె... రేయి మాత్రం గడచిపోయె 

వేళ చూడ వెన్నెలాయె... లోన చూడ వెచ్చనాయె
ఎందుకోమరి తెలియదాయె... రేయి మాత్రం గడచిపోయె 

చరణం 1 :

కొమ్మకొమ్మకు చిగుళ్లాయె...  గుండె నిండా గుబుళ్లాయె
కొమ్మకొమ్మకు చిగుళ్లాయె...  గుండె నిండా గుబుళ్లాయె
పువ్వు పువ్వున తుమ్మెదాయె... పొంగు వయసుతో పోరులాయె 

ఎందుకోమరి తెలియదాయె... రేయి మాత్రం గడచిపోయె 

చరణం 2 :

కునుకుపడితే ఉలికిపడుటాయే
కునుకుపడితే ఉలికిపడుటాయే
మెలకువైతే కునుకురాదాయె
వల్లమాలిన వగలతోటే
భల్లుభల్లున తెల్లవారె 

ఎందుకోమరి తెలియదాయె... రేయి మాత్రం గడచిపోయె 

చరణం 3 :

సరసమెరుగని చందమామ... చాటుమాటుగ సాగిపోయే
సరసమెరుగని చందమామ... చాటుమాటుగ సాగిపోయే
వెంటనున్న చుక్క కన్నె... జంటవుండీ ఒంటరాయె 

ఎందుకోమరి తెలియదాయె... రేయి మాత్రం గడచిపోయె 

వేళ చూడ వెన్నెలాయె... లోన చూడ వెచ్చనాయె
ఎందుకోమరి తెలియదాయె... రేయి మాత్రం గడచిపోయె 

https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7844

No comments:

Post a Comment