చిత్రం : ఆలాపన (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత :
నేపథ్య గానం : బాలు
పల్లవి :
ఆవేశమంతా ఆలాపనేలే... ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే... ఉదయినిగా
నాలో జ్వలించే వర్ణాల రచన
నాలో జనించే స్వరాలా...
ఆవేశమంతా ఆలాపనేలే...
చరణం 1 :
అల పైటలేసే సెలపాట విన్నా
గిరివీణ మీటే జలపాతమన్నా
నాలోన సాగే అలాపన... రాగాలు తీసే ఆలోచనా
ఝరుల జతల నాట్యం... అరవిరుల మరులకావ్యం
ఎగసి ఎగసి నాలో గళ మధువులడిగే గానం
నిదురలేచే నాలో హృదయమే
ఆవేశమంతా ఆలాపనే... ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనే
చరణం 2 :
వనకన్యలాడే తొలి మాసమన్నా
గోధూళి తెరలో మలిసంజె కన్నా
అందాలు కరిగే ఆవేదన... నాదాల గుడిలో ఆరాధన
చిలిపి చినుకు చందం... పురివిడిన నెమలి పింఛం
ఎదలు కదిపి నాలో విరిపొదలు వెతికే మోహం..
బదులు లేని ఏదో పిలుపులా
ఆవేశమంతా ఆలాపనేలే... ఎదలయలో
నాలో జ్వలించే వర్ణాల రచన
నాలో జనించే స్వరాలా...
ఆవేశమంతా ఆలాపనేలే...
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12467
No comments:
Post a Comment