Thursday, June 4, 2020

రా రా రా రంకె వేసిందమ్మొ

చిత్రం :  ఆలుమగలు (1977)
సంగీతం :  టి.చలపతిరావు
గీతరచయిత :  వీటూరి
నేపథ్య గానం :  బాలు, సుశీల

పల్లవి :

రా రా రా రంకె వేసిందమ్మొ రంగైన పోట్లగిత్త
కాలు దువ్విందమ్మో ఎటెట్టా.. ఎటెట్టా.. ఇంకెట్టాగా

కు కు కు కూతపెట్టిందమ్మో... ఈ లేత పాలపిట్టా
కస్సుమన్నాదమ్మో... ఎటెట్టా.. ఎటెట్టా.. ఇంకెట్టాగా  

చరణం 1 :

కోడెగాడు వేడి మీద చిందులేస్తున్నాడు
ఆడలేక అడుగే పడక గోల చేస్తున్నాడు
కోడెగాడు వేడి మీద చిందులేస్తున్నాడు
ఆడలేక అడుగే పడక గోల చేస్తున్నాడు

నీ పిట్ట కూతలు చాలే... ఓ పట్టు పడదాం రావే
ఈ మాటలెందుకు లేవే... నా ధాటి చూసుకోవే
కాళ్ళాగజ్జా కంకాళమ్మా... కాదోయమ్మా వెంకాయమ్మా
గిల్లికజ్జాలెందుకు లేవే.. రావే...

రా రా రా రంకె వేసిందమ్మొ రంగైన పోట్లగిత్త
కాలు దువ్విందమ్మో ఎటెట్టా.. ఎటెట్టా.. ఇంకెట్టాగా

చరణం 2 :

పిల్లకాకికేమి తెలుసే ఉండేలు దెబ్బా...
నీ డొక్క చించి డోలు కట్టి అనిపిస్తానే అబ్బా
పిల్లకాకికేమి తెలుసే ఉండేలు దెబ్బా...
నీ డొక్క చించి డోలు కట్టి అనిపిస్తానే అబ్బా

తైతక్కలాడావంటే నీ తిక్క వదిలేనోయి
సరసాలు మానవోయి... సరదాగా ఇంటికి పోయి
కృష్ణారామా అనుకోరాదా.. భక్తిముక్తి దొరుకును కాదా
నీకూ నాకు పోటీ ఎందుకు పోవోయ్...

కు కు కు కూతపెట్టిందమ్మో... ఈ లేత పాలపిట్టా
కస్సుమన్నాదమ్మో... ఎటెట్టా.. ఎటెట్టా.. ఇంకెట్టాగా 

కుప్పిగంతు కాదులేవే కూచిపూడి నాట్యం అంటే
కుప్పిగంతు కాదులేవే కూచిపూడి నాట్యం అంటే
రుబ్బురోలు పట్టు కాదే ర్యాక్ అండ్ రోలు డాన్సు అంటే
లలనా...  ఓ చెలియా...  ఓ సఖియా... తథిగిణథోం...  తథిగిణథోం...  తథిగిణథోం...

No comments:

Post a Comment