Wednesday, June 24, 2020

అనుకున్నా నేనని

చిత్రం :  మంచి రోజు (1970)
సంగీతం :  ఎం.బి.శ్రీరాం
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం :  జానకి 



పల్లవి :


అనుకున్నా నేనని...  వేరెవరూ కారని
అన్నావు నీవు నేనేనని... అన్నావు నీవు నేనని
             
అనుకున్నా నేనని...  వేరెవరూ కారని
అన్నావు నీవు నేనేనని
అనుకున్నా నేనని...  వేరెవరూ కారని
అన్నావు నీవు నేనేనని... అన్నావు నీవు నేనని



చరణం 1 :


ఎన్నాళ్ళు హాయిగా కలుసుకొంటిమి
ఇన్నాళ్లకు మనసు మనసు తెలుసుకొంటిమి
ఎన్నాళ్ళు హాయిగా కలుసుకొంటిమి
ఇన్నాళ్లకు మనసు మనసు తెలుసుకొంటిమి


ఈనాటి బంధము ఏనాటిదో...
ఈనాటి బంధము ఏనాటిదో... ఈ ప్రేమదీవెన ఏనోటిదో   
   

     

అనుకున్నా నేనని...  వేరెవరూ కారని
అన్నావు నీవు నేనేనని... అన్నావు నీవు నేనని


   

చరణం 2 :


చూపుల్లో సోయగాలు చుాసుకొంటిమి
ఎదలోని మమతలన్ని దాచుకొంటిమి
చూపుల్లో సోయగాలు చుాసుకొంటిమి
ఎదలోని మమతలన్ని దాచుకొంటిమి


ఎన్నెన్నో అనుభవాలు చూడనుంటిమి
ఎన్నెన్నో అనుభవాలు చూడనుంటిమి
ఆ మంచి రోజుకై వేచియుంటిని

         

అనుకున్నా నేనని...  వేరెవరూ కారని
అన్నావు నీవు నేనేనని...


అనుకున్నా నేనని...  వేరెవరూ కారని
అన్నావు నీవు నేనేనని... అన్నావు నీవు నేనని 



No comments:

Post a Comment