చిత్రం : భలే పాప (1971)
సంగీతం : ఆర్. సుదర్శనం
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం : సుశీల
పల్లవి :
అమ్మలారా... ఓ అయ్యలారా...
అమ్మలారా... ఓ అయ్యలారా...
మా అమ్మనెవరైనా చూశారా... ... చూశారా
అమ్మలారా ఓ అయ్యలారా...
మా అమ్మనెవరైనా చూశారా... చూశారా
చరణం 1 :
లాలలు పోసి... జోలలు పాడి
పాలబువ్వ తినిపించే మా అమ్మా
నాన్న వస్తాడన్నాది... ముద్దులు ఇస్తాడన్నాది
ఒక మాటైన చెప్పకా మాయమైపోయింది
అమ్మలారా... ఓ అయ్యలారా...
మా అమ్మనెవరైనా చూశారా...చూశారా
చరణం 2 :
ఓ బుజ్జి తువ్వాయి... నీకుంది అమ్మా
ఓ గువ్వ పాపాయి... నీకుంది అమ్మా
ఓ బుజ్జి తువ్వాయి... నీకుంది అమ్మా
ఓ గువ్వ పాపాయి... నీకుంది అమ్మా
ఓ బొజ్జ గణపయ్య... నీకూ అమ్ముంది
ఓ బొజ్జ గణపయ్య... నీకూ అమ్ముంది
మీ అమ్మనడగవా... మా అమ్మ ఏదని
అమ్మలారా... ఓ అయ్యలారా...
మా అమ్మనెవరైనా చూశారా...చూశారా
No comments:
Post a Comment