Wednesday, June 24, 2020

నీకోసమని నే వేచినానే

చిత్రం :  మంచి రోజు (1970)
సంగీతం :  ఎం.బి.శ్రీరాం
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం :  పి. బి. శ్రీనివాస్ 



పల్లవి :


నీకోసమని నే వేచినానే
ఉరింపులు ఇక చాలునే
ఈ బిగువేలనే నా మాటవిని
మోముగని పులకించని... నీ మోముగని పులకించని



నీకోసమని నే వేచినానే
ఉరింపులు ఇక చాలునే   


               

చరణం 1 :


నీ కనుపాపలలో నా రూపం
ఈ  కోపము మాని నను చూడని
నీ నవ్వులు కురిసే వెన్నెలలో
మధుపానము చేసి ననుపాడని


నీకోసమని నే వేచినానే
ఉరింపులు ఇక చాలునే  

                     

చరణం 2 :


అనురాగసుమాలే వెదజల్లి
నీ బ్రతుకుబాటలో పయనించని
మన మనసులు రెండు ముడివేసి
బిగికౌగిలి గదిలో శయనించని 


నీకోసమని నే వేచినానే
ఉరింపులు ఇక చాలునే
ఈ బిగువేలనే నా మాటవిని
మోముగని పులకించని... నీ మోముగని పులకించని




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4672

No comments:

Post a Comment