Saturday, June 6, 2020

బొట్టు కాటుక పెట్టుకుని

చిత్రం : కీలుబొమ్మలు (1964)
సంగీతం :  కోదండపాణి
గీతరచయిత :  ఆరుద్ర
నేపథ్య గానం : సుశీల 

పల్లవి :

బొట్టు కాటుక పెట్టుకొని.. పూవుల దండలు ముడుచుకొని
తూరీగల్లే ఎగిరేదానా తొందరలోనే వస్తాడు... మొగుడొస్తాడు 
 
చరణం 1 :

చీటికి మాటికి చెలరేగే నీ నోటికి తాళం వేస్తాడు
చీటికి మాటికి చెలరేగే నీ నోటికి తాళం వేస్తాడు
వెక్కిరించు నీ వెటకారాలకు టక్కున కళ్ళెం వేస్తాడు

బొట్టు కాటుక పెట్టుకొని.. పూవుల దండలు ముడుచుకొని
తూరీగల్లే ఎగిరేదానా తొందరలోనే వస్తాడు... మొగుడొస్తాడు 

చరణం 2 :

మిడిసిపాటు ఇంకెన్నాళ్ళులే నీ మెడలు వంచి ముడి వేస్తాడు
చెప్పిన మాటలు వినకుంటే...
చెప్పిన మాటలు వినకుంటే... నీ చెవులు పట్టి ఆడిస్తాడు

బొట్టు కాటుక పెట్టుకొని.. పూవుల దండలు ముడుచుకొని
తూరీగల్లే ఎగిరేదానా... తొందరలోనే వస్తాడు... మొగుడొస్తాడు 

చరణం 3 :

సిగ్గులతో తలవంచుకొనే నీ బుగ్గ మీద చిటికేస్తాడు
జరిగే కొలదీ ఎడమైతే...
జరిగే కొలదీ ఎడమైతే... నీ జడతో భరతం పడతాడు

బొట్టు కాటుక పెట్టుకొని.. పూవుల దండలు ముడుచుకొని
తూరీగల్లే ఎగిరేదానా తొందరలోనే వస్తాడు... మొగుడొస్తాడు 

No comments:

Post a Comment