చిత్రం : ఆహుతి (1988)
సంగీతం : సత్యం
గీతరచయిత : మల్లెమాల
నేపథ్య గానం : జానకి
పల్లవి :
సూరీడు తూరుపున దీపమై వెలుగు
ఆ వెలుగు లోకానికంతటికి వెలుగు
సూరీడు తూరుపున దీపమై వెలుగు
ఆ వెలుగు లోకానికంతటికి వెలుగు
పుడమి ముత్తైదువ పులకించిపోవ
సిరి బొట్టు పెట్టి... నే తీర్చినట్టి
ముగ్గులే ముంగిలికి ముత్యాల వెలుగు... ముత్యాల వెలుగు
సూరీడు తూరుపున దీపమై వెలుగు
ఆ వెలుగు లోకానికంతటికి వెలుగు
చరణం 1 :
హరివిల్లులో లేని సొగసు... నీ చిరునవ్వులో ఉన్నది
సిరివెన్నెలను మించు సిరులు... నీ చిరు బుగ్గలో ఉన్నవి
నీ ముద్దు మురిపాలు నాకు వైభోగాలు
నీ ముద్దు మురిపాలు నాకు వైభోగాలు
ఈ అమ్మ ప్రేమకు నువ్వానవాలు... నువ్వానవాలు
సూరీడు తూరుపున దీపమై వెలుగు
ఆ వెలుగు లోకానికంతటికి వెలుగు
చరణం 2 :
దిగులెందుకో నాకు తెలుసు... నీకు దేవుడే అండగా నిలుచు
ఇది మనసు విరబూయు వయసు.... ఇపుడు నిలపాలి చదువుపై మనసు
బుద్దిగా మసలుతూ శ్రద్దగా చదివి
బుద్దిగా మసలుతూ శ్రద్దగా చదివి...
తేవాలి మనముందు తెలుగుకే వెలుగు.... తెలుగుకే వెలుగు
సూరీడు తూరుపున దీపమై వెలుగు
ఆ వెలుగు లోకానికంతటికి వెలుగు
No comments:
Post a Comment