Saturday, June 6, 2020

ఏరెల్లి పోతున్నా

చిత్రం :  ఆశా జ్యోతి (1981)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం : బాలు 


పల్లవి :


ఏరెల్లి పోతున్నా... ఆ.. ఆ..
ఏరెల్లి పోతున్నా నీరుండిపోయింది
నీటి మీద రాత రాసి నావెల్లిపోయింది... నావెల్లిపోయింది


కోటిపల్లి రేవు కాడా చిలకమ్మా గొడవా
కోరంగి దాటింది గోరింక  పడవా
ఏరెల్లి పోతున్నా నీరుండిపోయింది


నీటి మీద రాత రాసి నావెల్లిపోయింది... నావెల్లిపోయింది


చరణం 1 :


ఏటి పాప శాపమ్మ  ఎగిసి తాను సూసింది
ఏడ  నావోడంటే ఏటిలోనా మునిగింది
శాప మునిగినాకాడా శతకోటి సున్నాలు
శాపమైన గుండెలోనా సెప్పలేని సుడిగుండాలు
శాపమైన గుండెలోనా సెప్పలేని సుడిగుండాలు


ఏరెల్లి పోతున్నా నీరుండి పోయింది
నీటి మీద రాత రాసి నావెల్లిపోయింది... నావెల్లిపోయింది



చరణం 2 :


ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ..
ఏటికొక్క దారంటా ఏరు సాగిపోతుంది
చేరువైన ఊరువాడా పైరు పచ్చనౌతుంది
ఏరు తగిలినాకాడా ఏడాది తిరనాళ్ళు
ఏరు తగిలినాకాడా ఏడాది తిరనాళ్ళు
ఏరులోనా నీరెంతున్నా ఎంత కడవ కన్నే నీళ్ళు
ఏరులోనా నీరెంతున్నా ఎంత కడవ కన్నే నీళ్ళు


ఏరెల్లి పోతున్నా...ఓ...ఓ... ఓ... 

No comments:

Post a Comment