Friday, June 5, 2020

ఏరువాకమ్మా మాకెదురు రావమ్మా

చిత్రం :  ప్రజానాయకుడు (1972)
సంగీతం :  కె. వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : బాలు, సుశీల


పల్లవి :


ఏరువాకమ్మా ... మాకెదురు రావమ్మా
ఎదురొచ్చి ఎడతెగని సిరులిచ్చిపోవమ్మా
ఏరువాకమ్మా...  మాకెదురు రావమ్మా
ఎదురొచ్చి ఎడతెగని సిరులిచ్చిపోవమ్మా


ఏరువాకమ్మా...  మాకెదురు రావమ్మా.. ఆ.. ఆ.. 



చరణం 1 :


దున్నాలి దుక్కులు నిండాలి డొక్కలు...
మొక్కండి వస్తాయి మృగశిరా వానాలు... మృగశిరా వానాలు


దున్నాలి దుక్కులు నిండాలి డొక్కలు...
మొక్కండి వస్తాయి మృగశిరా వానాలు...
ఒక్క గింజ కోటిగా పండుతాయి పంటలు... పండుతాయి పంటలు


ఏరువాకమ్మా...  మాకెదురు రావమ్మా
ఎదురొచ్చి ఎడతెగని సిరులిచ్చిపోవమ్మా
ఏరువాకమ్మా ... మాకెదురు రావమ్మా.. ఆ... ఆ..


చరణం 2 :


బుట్టల్లో బువ్వతో.. దుత్తల్లో చల్లతో
వస్తుంది చిలకల్లే వయ్యారి మొలక
తినిపిస్తుంది ముద్దలు...  ముద్దుముద్దుగా


బుట్టల్లో బువ్వతో.. దుత్తల్లో చల్లతో
వస్తుంది చిలకల్లే వయ్యారి మొలక
తినిపిస్తుంది ముద్దలు...  ముద్దుముద్దుగా


హాయ్... ముద్దుముద్దుగా... ముద్దుముద్దుగా


చరణం 3 :


వేడి నీళ్ళు కాచున్నాను.. వేడి అన్నం వండిన్నాను
ఇంటి వాకిట నిల్చున్నాను... మావా...
ఇన్నెదురు చూపులు చూస్తున్నాను... మావా
తానమాడి అన్నం తినిరా.. తమలపాకులు అందిస్తాను
తానమాడి అన్నం తినిరా.. తమలపాకులు అందిస్తాను
నీ నోటి ఎరుపు చూసి నాపై ఎంత వలపో తెలుసుకుంటాను


ఏరువాకమ్మా.. వేరెవరో కాదమ్మా...
ఇంటిలోనా కంటిలోనా వెలిగే ఇల్లాలేనమ్మా
ఏరువాకమ్మా.. వేరెవరో కాదమ్మా...




No comments:

Post a Comment