చిత్రం : ఐ లవ్ యూ (1979) సంగీతం : సత్యం గీతరచయిత : ఆరుద్ర నేపథ్య గానం : జానకి
పల్లవి :
నాజూకు నాలో ఉంది చూడరా నాలాంటి చిన్నది వేరే లేదురా వొళ్ళంతా వయ్యారం పొంగేను సింగారం నానీటు నా గోటు నీ కోసం దాచాను తీసుకో సత్తా ఉంటే సంకెళ్ళన్ని తెంచుకో సరదాలన్నీ నాతో నువ్వు పంచుకో ఆనందాలు ఆవేశాలు తెంచుకో
చరణం 1 :
ఉర్రూతలూగించేదే ఊర్వశి... ఉవ్విళ్లు ఊరించేదే ప్రేయసి క్రీగంట చూశానో నా వెంట పడతావు కొనగోట తాకేను నాజంట కడతావు హాయిగా లోకులు చూసి నేనేనంటావు మేనకా ఇంపు సొంపూ ఇస్తా నీకు కానుకా నీలో బాగా రగిలిస్తాను కోరికా
చరణం 2 :
బులపాటం ఆడించేయి కోపమా ఉబలాటం తీరకపోతే తాపమా రాగాలు భోగాలు లాలించి తేలించి పరువాల కెమ్మోవి పానీయం అందిస్తా అందుకో నీతో నేను పందెం కడతా కాసుకో అందంతో నే బందీ చేస్తా చూసుకో పౌరుషముంటే నన్నే సొంతం చేసుకో
అందుకో నీతో నేను పందెం కడతా కాసుకో అందంతో బందీచేస్తా చూసుకో పౌరుషముంటే నన్నే సొంతం చేసుకో
No comments:
Post a Comment