Monday, July 20, 2020

ఆడాలా పాడాలా

చిత్రం : చెప్పింది చేస్తా (1978)
సంగీతం :  సత్యం
గీతరచయిత : రాజశ్రీ
నేపథ్య గానం : జానకి, సుశీల 
 





పల్లవి : 


ఆడాలా పాడాలా...
ఈనిలయం విష వలయం... దాటేగతిలేకా ఈ వేళా
ఆడాలా పాడాలా
ఈనిలయం విషవలయం...దాటేగతిలేకా ఈ వేళా
ఆడాలా పాడాలా



చరణం 1 :


ఆరనివేదన నాలో రేగినా... రేగినా
ఏ చిరునవ్వులతో తుళ్లి ఆడనా... ఆడనా
ఆఖరి ఉాపిరి నాలో ఆగినా... ఆగినా
నే రగిలే ఎదతో రాగం పాడనా... పాడనా
ఓ... ప్రాణములే పందెముగా చిందులవేసేనా


ఆడాలా పాడాలా
ఈనిలయం విషవలయం... దాటేగతిలేకా ఈ వేళా
ఆడాలా పాడాలా


చరణం 2 :


సవాలు చేసిన నన్ను మరవకు 
నీకు గులామునవుతానంటు తలవకు
ఆడది అలుసని అనుకుంటె తప్పురా   
అది ఎదురుతిరితే నీకే ముప్పురా
మోసాలు ఘోరాలు ఇకపై సాగవురా


ఆడాలా పాడాలా
ఈనిలయం విషవలయం దాటేగతిలేకా ఈ వేళా
ఆడాలా పాడాలా 

No comments:

Post a Comment