Tuesday, August 25, 2020

ఎగరేసిన గాలిపటాలు

చిత్రం :  స్నేహం (1977)
సంగీతం :   కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం :  పి. బి. శ్రీనివాస్   



పల్లవి :


ఎగరేసిన గాలిపటాలు
దొంగాట దాగుడుమూతలూ
గట్టు మీద పిచ్చుక గూళ్ళు
కాలువలో కాగితం పడవలూ


గోళీలు గోటీబిళ్ళ... ఓడిపోతే పెట్టిన డిల్ల
చిన్ననాటి ఆనవాళ్ళు... స్నేహంలో మైలురాళ్ళు



చరణం 1 :


పడగొట్టిన మావిడికాయ... పొట్లంలో ఉప్పూకారం
తీర్ధంలో కొన్న బూర... కాయ్ రాజా కయ్
కాయ్ రాజా కయ్... కాయ్ రాజా కయ్
కాయ్ రాజా కయ్... కాయ్ రాజా కయ్... కాయ్ రాజా కయ్



చరణం 2 :



దసరాలో పువ్వుల బాణం... దీపావళి బాణా సంచా
చిన్నప్పటి ఆనందాలు... చిగురించిన మందారాలు


నులివెచ్చని భోగిమంటా... మోగించిన గుడిలో గంటా
వడపప్పు పానకాలు... పంచుకున్న కొబ్బరి ముక్క


గొడమీద రాసిన రాతలు...వీడిపోవు వేసిన బొమ్మలు
చెరిగిపోని జ్ఞాపకాలు... చిత్త స్వాతి వానజల్లు


చిన్ననాటి ఆనవాళ్ళు... స్నేహంలో మైలిరాళ్ళు
చిన్నప్పటి ఆనందాలు... చిగురించిన మందారాలు




No comments:

Post a Comment