చిత్రం : స్నేహం (1977)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం : బాలు
పల్లవి :
సరే సరే ఓరన్నా... సరే సరే
పిలిచి పిలిచి ఇంకా వేధించనులే
గుండె కలచి కలచి నిన్ను బాధించనులే
సరే సరే ఓరన్నా... సరే సరే
సరే సరే ఓరన్నా... సరే సరే
చరణం 1 :
వెర్రిగాలి వీచినప్పుడు... వెదురైనా పాడుతుంది
నల్లమబ్బు పట్టినప్పుడు... నెమిలైనా ఆడుతుంది
నీ నేస్తం నీ కోసం చావు కేక వేస్తే... పలుకనైన పలకవు
రాయిలా... ఉలకనైన ఉలకవు
సరే సరే ఓరన్నా... సరే సరే
సరే సరే ఓరన్నా... సరే సరే
చరణం 2 :
అనుక్షణము నీ పేరే తలుచుకుంటాను
మనసులోన నీ ఊసే మలుచుకుంటాను
అనుక్షణము నీ పేరే తలుచుకుంటాను
మనసులోన నీ ఊసే మలుచుకుంటాను
నీవే దిగివస్తావని నిలిచి ఉంటాను
నీవు బాగుండాలని వేయి దేవుళ్ళను కొలుచుకుంటాను
పిలిచి పిలిచి ఇంకా వేధించనులే
గుండె కలచి కలచి నిన్ను బాధించనులే
సరే సరే ఓరన్నా... సరే సరే
సరే సరే ఓరన్నా... సరే సరే
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7233
No comments:
Post a Comment