Friday, August 7, 2020

చిరంజీవి గోదావరి

చిత్రం : గోదావరి పొంగింది (1985)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు  




పల్లవి : 


చిరంజీవి గోదావరి పడమటింట పుట్టింది
సౌభాగ్యవతి తాను తెలుగునాట మెట్టింది
దక్షిణాది గంగగా దయతో ఉప్పొంగుతూ...
కల్యాణిగా తాను కడలిలో కలిసింది 


మా ఇల్లు అత్తిల్లుగా...  చల్లగా వర్ధిల్లు గోదావరి
మా ఇల్లు అత్తిల్లుగా...  చల్లగా వర్ధిల్లు గోదావరి



చరణం 1 :



నాసికా త్రియంబకాన గోముఖాన పుట్టి
మహారాష్ట్ర లావణీల  మంజీరం కట్టి
నాసికా త్రియంబకాన గోముఖాన పుట్టి
మహారాష్ట్ర లావణీల  మంజీరం కట్టి


సీతమ్మ సిగలోనా మందారం చుట్టి...
శబరి తల్లి ఫలహారం రామయ్యకు పెట్టి
భవభూతి  శ్లోకమై... శ్రీనాథుడి సీసమై


మా ఇంటి మాలక్ష్మివై తల్లివై... వర్ధిల్లు గోదావరి
మా ఇంటి మాలక్ష్మివై తల్లివై... వర్ధిల్లు గోదావరి



చరణం 2 :


చాళుక్యుల వైభవాలు జగమంతా చాటి
నన్నయ్యకు తెలుగు కవిత ఉగ్గుపాలు పట్టి
చాళుక్యుల వైభవాలు జగమంతా చాటి
నన్నయ్యకు తెలుగు కవిత ఉగ్గుపాలు పట్టి


కోనసీమ పచ్చదనం కోకలుగా చుట్టి
సప్త ఋషులు సాగనంప సాగరాన మెట్టి
రామదాసు కీర్తనై.. పంచవటి గానమై

మా పాలి ఇలవేల్పువై వెల్లువై... వర్ధిల్లు గోదావరి
మా పాలి ఇలవేల్పువై వెల్లువై... వర్ధిల్లు గోదావరి



చిరంజీవి గోదావరి పడమటింట పుట్టింది
సౌభాగ్యవతి తాను తెలుగునాట మెట్టింది
దక్షిణాది గంగగా దయతో ఉప్పొంగుతూ
కల్యాణిగా తాను కడలిలో కలిసింది 

మా ఇల్లు అత్తిల్లుగా చల్లగా... వర్ధిల్లు గోదావరి
మా ఇల్లు అత్తిల్లుగా చల్లగా... వర్ధిల్లు గోదావరి



No comments:

Post a Comment