చిత్రం : గోదావరి పొంగింది (1985)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..ఆ
ఆ.. ఆ.. ఆ.. ఆ... ఆ..
పడమటింటిలో దీపం పెట్టి...
పాపికొండల పావడగట్టి...
కడలి చిందుల గజ్జలు కట్టి...
గోదారి ఏమన్నది... ఇంక మా దారి ప్రేమన్నది
గోదారి ఏమన్నది... ఇంక మా దారి ప్రేమన్నది
వేయి పడవల వెన్నెల పట్టి...
అలల నురుగుల ముగ్గులు పెట్టి...
కాపురానికి కౌగిలి పట్టి...
గోదారి ఏమన్నది... ప్రేమ పూదారి మనదన్నది
గోదారి ఏమన్నది... ప్రేమ పూదారి మనదన్నది
చరణం 1 :
ముక్కుపుడక మెరుపులే ముద్దుగుమ్మ పిలుపులై రవ్వంత రమ్మన్నవి
ఏటి గాలి తరగలే పైటలాగి వలపులా నీ జంట కమ్మన్నవి
ముక్కుపుడక మెరుపులే ముద్దుగుమ్మ పిలుపులై రవ్వంత రమ్మన్నవి
ఏటి గాలి తరగలే పైటలాగి వలపులా నీ జంట కమ్మన్నవి
నీలాటి రేవులో చేపలన్నీ... నీలాల నీ కంటి పాపలైతే
నీలాటి రేవులో చేపలన్నీ... నీలాల నీ కంటి పాపలైతే
తెల్లబోయి చూసింది ఆ గౌతమి
మల్లెపూలు జల్లింది మందాకిని
మలిసంధ్య ఇచ్చేటి తాంబూలం పుచ్చుకొని...
గోదారి ఏమన్నది... ఇంక మా దారి ప్రేమన్నది
గోదారి ఏమన్నది... ఇంక మా దారి ప్రేమన్నది
చరణం 2 :
లేత కొబ్బరాకులా పూత పాల వెన్నెలా ఈవేళ ఏమన్నది
ఎండకన్ను సోకితే వెన్నెలన్న పిల్లకి ముదిరింది ప్రేమన్నది
లేత కొబ్బరాకులా పూత పాల వెన్నెలా ఈవేళ ఏమన్నది
ఎండకన్ను సోకితే వెన్నెలన్న పిల్లకి ముదిరింది ప్రేమన్నది
కడవెత్తుకొస్తున్న నన్ను జూసి... గొడవెక్కువౌతున్న నిన్ను జూసి
కడవెత్తుకొస్తున్న నన్ను జూసి... గొడవెక్కువౌతున్న నిన్ను జూసి
కొమ్మల్లో నవ్వింది ఓ కోయిలా.. మత్తెక్కి ఝుమ్మంది ఓ తుమ్మెద
పెదవుల్ని కలిపేటి పేరంటానికి వచ్చి
గోదారి ఏమన్నది... ఇంక ఏమన్న విననన్నది
గోదారి ఏమన్నది... ఇంక అహహ.. ఉం.. ఉం... ఉ..
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7630