చిత్రం : ఈతరం మనిషి (1977)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
హహ...
నవనవలాడే లే జవరాలు చెవిలో ఏదో చెప్పింది
ఊహకు అందని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసింది
ఓ మై డార్లింగ్ ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
నవనవలాడే లే జవరాలు చెవిలో ఏదో చెప్పింది
ఊహకు అందని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసింది
ఓ మై డార్లింగ్ ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
చరణం 1 :
ఎర్రని పెదవుల మీదా తెల్లని నవ్వుంది... హ
తెల్లని నవ్వులలోనా చల్లని వలపుంది... హ
ఎర్రని పెదవుల మీదా తెల్లని నవ్వుంది... హ
తెల్లని నవ్వులలోనా చల్లని వలపుంది... హ
చల్లని వలపు నాలో వెచ్చగ వెచ్చగ మారి
ఏదో అల్లరి చేస్తోంది.. ఎంతో తొందర పెడుతోంది
హెహె...
నవనవలాడే లే జవరాలు చెవిలో ఏదో చెప్పింది
ఊహకు అందని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసింది
ఓ మై డార్లింగ్ ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
చరణం 2 :
పగలే వెన్నెల కాచి పండుగ చేస్తోంది... హ
విరిసిన పువ్వుల తోట విందులు చేస్తోంది... హ
పగలే వెన్నెల కాచి పండుగ చేస్తోంది... హ
విరిసిన పువ్వుల తోట విందులు చేస్తోంది... హ
చేయి చేయి చేర్చి చిలకా గోరింకల్లే...
మనసు మనసు కలపాలి... మల్లెల చాటుకు పోవాలి
నవనవలాడే లే జవరాలు చెవిలో ఏదో చెప్పింది
ఊహకు అందని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసింది
ఓ మై డార్లింగ్ ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2506
No comments:
Post a Comment