Sunday, September 13, 2020

తగునా నీకిది జవరాలా

 



చిత్రం : రామాయణంలో పిడకల వేట (1980)

సంగీతం : సత్యం

గీతరచయిత :  జాలాది 

నేపథ్య గానం : రమణ, బాజీరావ్


పల్లవి :


తగునా నీకిది జవరాలా... తగునా నీకిది జవరాలా

తకతైకతైకమని తరలిపోవగా 

తగవులేల ఈ బిగువులేేలనే 

తగునా నీకిది జవరాలా ప్రియురాలా రావేలా


తగునా నీకిది ఓ రసికా... తగునా నీకిది ఓరసికా

తకతైకతైకమని సైగచేసి నడివీధిలోన 

నగుబాటుసేయక 

తగునా నీకిది ఓ రసికా... ప్రాణసఖా చాలునికా



చరణం 1 :


అంబరు జగదాంబ కరుణించు భ్రమరాంబ

రంగుబంగరుబొమ్మ రంగేళి చిలకమ్మా 

అంబరు జగదాంబ కరుణించు భ్రమరాంబ

రంగుబంగరుబొమ్మ రంగేళి చిలకమ్మా 


ఇంటినుండి నను వెంటతెచ్చినది కొంటె వలపు నయగారమా              

సొంతపెళ్లామా చెంత చేర్చుకుని సరసమాడుటిది నేరమా          

వగలిక చాలించి వలపించరారా 

వగలిక చాలించి వలపించరారా

మగువల మనసెరిగి బులిపించుకోరా


తగునా నీకిది ఓ రసికా... తగునా నీకిది ఓరసికా

తకతైకతైకమని సైగచేసి నడివీధిలోన 

నగుబాటుసేయక 

తగునా నీకిది ఓ రసికా... ప్రాణసఖా చాలునికా



చరణం 2 :


చాలు సరసాలింక గడసరి గొరవంక

సమయము కాదింక... రాలేదు నెలవంక

చాలు సరసాలింక గడసరి గొరవంక

సమయము కాదింక... రాలేదు నెలవంక



జంటలోనే చలిమంటలోన నాకొంటె వయసు చల్లార్చని

రసికరాజు ఇటు ఇసుకతిన్నెల పూలపాన్పునిక లేవరా

పూలపాన్పులకన్నా ఇసుకతిన్నెలుమిన్నా

పూలపాన్పులకన్నా ఇసుకతిన్నెలుమిన్నా

వంటగది పొగకన్నా వగల సెగలే మిన్నా

  


తగునా నీకిది జవరాలా... 

తకతైకతైకమని తరలిపోవగా 

తగవులేల ఈ బిగువులేేలనే 


తగునా నీకిది ఓ రసికా

తకతైకతైకమని సైగచేసి నడివీధిలోన 

నగుబాటుసేయక 

తగునా నీకిది ఓ రసికా... ప్రియురాలా.. చాలునిక



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5471

No comments:

Post a Comment