చిత్రం : శీలానికి శిక్ష (1976)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
శుభమస్తు... శుభమస్తు... అన్నదీ గుడిగంట
తథాస్తు... తథాస్తు... అనుకున్నది మనజంట
శుభమస్తు... శుభమస్తు... అన్నదీ గుడిగంట
చరణం 1 :
వయసు తోటలో తొలివలపు వసంతం
మనసులో విరితేనెలు కురిసింది
మనువే తనువై అణువణువు వేణువై
నీ మమతై కవితై మెరిసింది... నాలో మెరిసింది
శుభమస్తు... శుభమస్తు... అన్నదీ గుడిగంట
చరణం 2 :
గూటిపడవలో వెన్నెల ఏటవాలుగా పడుతుంటే
పైటజారు నీ పరువం మాట మాట అంటుంటే
మాటలే పాటలై మనసు పరవశిస్తుంటే
ఆ పాట జిలుగుపైటగా నిన్ను దాచుకుంటే.... ఆ... ఆ... ఆ
శుభమస్తు... శుభమస్తు... అన్నదీ గుడిగంట
చరణం 3 :
కలిసి మెలిసి కలకాలం బతికె
కలల పంట మనతియ్యని కాపురము
అది దిక్కులు దాచిన... దీపం వెలిగినా
దైవం వెలిసిన గోపురము... గుడిగోపురము
శుభమస్తు... శుభమస్తు... అన్నదీ గుడిగంట
తథాస్తు... తథాస్తు... అనుకున్నది మనజంట
శుభమస్తు... శుభమస్తు... అన్నదీ గుడిగంట
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4613
No comments:
Post a Comment