Wednesday, September 2, 2020

ముద్దబంతి ముసిముసినవ్వుల



చిత్రం : శీలానికి శిక్ష (1976)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : రామకృష్ణ  


పల్లవి :


ముద్దబంతి ముసిముసినవ్వుల వచ్చెనమ్మా సంక్రాంతి
సంపదలెత్తిన సిరిసిరిమువ్వలు తెచ్చెనమ్మా సంక్రాంతి
ముద్దబంతి ముసిముసినవ్వుల వచ్చెనమ్మా సంక్రాంతి



తోరణాల వాకిళ్లో దోరనవ్వు లోగిళ్లో
ముంగిట్లో ముగ్గుల్లో మొగ్గలైన సిగ్గుల్లో
అల్లుళ్లొచ్చే గొబ్బిళ్లో అమ్మాయికి అవి పొంగళ్లో


ముద్దబంతి ముసిముసినవ్వుల వచ్చెనమ్మా సంక్రాంతి
వచ్చెనమ్మా సంక్రాంతి... వచ్చెనమ్మా సంక్రాంతి 


చరణం 1 :



హరిలోరంగ హరి...
ధశరథ రామ నీకు దయరాదా సార్వభౌమ
ధశరథ రామ నీకు దయరాదా సార్వభౌమ
ఉన్నది వనసీమలందున చిన్నది సీతమ్మ వయసున
ధశరథా రామ నీకు దయరాదా సార్వభౌమ


ఎన్నడో నీరాక తెలియక తెన్నులన్ని వెదికివేసరి
ఉన్నదేమొగాని ప్రాణము కన్నుల నిను చూడవలెనని         
ధశరథారామ నీకు దయరాదా సార్వభౌమా


పరులమాటలు నమ్మి ఆ పరమసాధ్విని అడవికంపి
ఏమిరాజ్యము నేలుచుంటివో భామనీగతి వదిలి నీవు             
ధశరథారామ నీకు దయరాదా సార్వభౌమా... కృష్ణార్పణం




చరణం 2 :



పెద్దపండుగొచ్చింది బుడుగో బుడుగో
ముద్దబంతి విచ్చింది బుడుగో బుడుగో
గంగిరెద్దు వచ్చింది బుడుగో బుడుగో
వంగిదణ్ణమెట్టింది బుడుగో బుడుగో
పంటచేను కురిసింది బుడుగో బుడుగో
ఇంటరాత్రి వెలిసింది బుడుగో బుడుగో
సంకురాత్రి వచ్చింది బుడుగో బుడుగో
జంకురాత్రి వెళ్లింది బుడుగో బుడుగో



No comments:

Post a Comment