చిత్రం : సమాధికడుతున్నాం చందాలివ్వండి (1980)
సంగీతం : జె. వి. రాఘవులు
గీతరచయిత : మైలవరపు గోపి
నేపథ్య గానం : సుశీల
పల్లవి :
సమాధి కడుతున్నాం బాబు చందాలివ్వండి
పెద్దమనుషుల దోపిడీలకు పెత్తందారి
విధానాలకు సజావుగా బహు నిజాయితీగా
సమాధి కడుతున్నాం బాబు చందాలివ్వండి
చరణం 1 :
కరెన్సినోట్లు రాజ్యం చేసే గడ్డురోజులు పోయాయి
కష్టజీవి కన్నీటి బొట్లు ఓట్లుగా మారాయి
చందా అంటే చందరయ్యకు వేసే మీ ఓటు
ఓటేపునాది ఛస్తే సమాధి రేపటి ఉగాది కోసం
సమాధి కడుతున్నాం బాబు చందాలివ్వండి
చరణం 2 :
అమ్మల్లారా అయ్యల్లారా...
ఓనమహా రానివాళ్లకు ఓట్లువెయ్యద్దు...
ఎం.ఎల్.ఏ చెయ్యద్దు
దేవుడుకిచ్చే పండు ఫలము దెయ్యాలకు వద్దు
గ్రామదేవతలకు వద్దు
ఓటేపునాది ఛస్తే సమాధి రేపటి ఉగాదికోసం
సమాధి కడుతున్నాం బాబు చందాలివ్వండి
సమాధి కడుతున్నాం బాబు చందాలివ్వండి
పెద్దమనుషుల దోపిడీలకు పెత్తందారి
విధానాలకు సజావుగా బహు నిజాయితీగా
సమాధి కడుతున్నాం చందాలివ్వండి
సమాధి కడుతున్నాం బాబు చందాలివ్వండి
సమాధి కడుతున్నాం బాబు చందాలివ్వండి
No comments:
Post a Comment