Tuesday, October 27, 2020

ఇదా ప్రపంచం

 



చిత్రం :  ఇదా ప్రపంచం (1987)

సంగీతం :  జాలాది

గీతరచయిత :  చక్రవర్తి  

నేపథ్య గానం :  బాలు 



పల్లవి :


ఇదా ప్రపంచం... ఇదేనా ప్రపంచం

ఇదా సమిష్టి సమాజం


మరో తరానికి...  మహోజ్వలానికి

మహాత్ములడిగిన మరో ప్రపంచం


ఇదా ఇదా ప్రపంచం

ఇదా ఇదా ప్రపంచం


చరణం 1 :


చీకటి చింపిన విస్తరిలో

ఆకలి మెతుకుల అవమానం

ఆశల కోసం దేశాన్నైనా

అమ్ముకు బ్రతికే అభిమానం


ఇది జీవితమాడే చదరంగం

చీకటి వెలుగుల సుడిగుండం

తీరము చేరని నావలతో

తెరమరుగాడే పావులతో


ప్రతి నిమిషం ఒక ప్రళయ రోదన

ప్రతి ఉదయం ఒక ప్రసవ వేదన


ఇదా ఇదా ప్రపంచం

ఇదా ఇదా ప్రపంచం


మరో తరానికి...  మహోజ్వలానికి

మహాత్ములడిగిన మరో ప్రపంచం


ఇదా ఇదా ప్రపంచం

ఇదా ఇదా ప్రపంచం


చరణం 2 :



రాతిరి కురిసే వెన్నెల్లో

చేతులు కడిగే హంతకులు

శవాలపైనే సవారి చేసే

అమానుషానికి ప్రతీకలు


ఆ సమ్మెలు కట్టిన సమాధి

అది స్వార్ధపరులకే పునాది

కపట స్వతంత్రం కౌగిట్లో

కటిక దరిద్రం పేగుల్లో


ప్రజాభ్యుదయమే ప్రణాళికల్లో

ప్రపంచ యుద్ధం ప్రతీక్షణంలో

ఇదా ఇదా ప్రపంచం


మరో తరానికి....  మహోజ్వలానికి

మహాత్ములడిగిన మరో ప్రపంచం


ఇదా ఇదా ప్రపంచం

ఇదా ఇదా ప్రపంచం



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7608

No comments:

Post a Comment