చిత్రం : మంత్రిగారి వియ్యంకుడు ( 1983)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు
పల్లవి :
కొలువైనాడే ఊరికి కొరివైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయడే
కొలువైనాడే ఊరికి కొరివైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయడే
కురిడీ పెట్టి బురిడీ గొట్టి ధరలో బుట్టి ధరలే పెంచీ
కురిడీ పెట్టి బురిడీ గొట్టి ధరలో బుట్టి ధరలే పెంచీ
కొలువైనాడే ఊరికి కొరివైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయడే
చరణం 1 :
కోనసీమ తోటల్లోన కొండముచ్చు వీడేనమ్మా
కొబ్బరికాయ చూశాడమ్మా కోతిలాగ గెంతాడమ్మా
తాళ్ళే పేనాడు మారాముళ్ళే వేశాడు
తైలం తీశాడు మా తలకే రాశాడు
కొబ్బరి రుబ్బి సబ్బులు చేసి అమ్మాడు హోయ్
సారాబట్టీ పెట్టి కోట్లే పట్టాడు
ఓయమ్మో మాయమ్మో ఓయమ్మో మాయమ్మో
కొలువైనాడే కొండచిలువైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయడే
కొలువైనాడే కొండచిలువైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయడే
చరణం 2 :
తధిగిణతోం తద్ధీంగిణ్ణ తొడగడితే టపడపడప్ప
కలబడతాం డిష్షుం డిష్షుం తలకొడతాం హా...
తధిగిణతోం తొడగడితే కలబడతాం తలకొడతాం
ఓరోరి కొబ్బరిబొండాం ఐతే మా ఊరికి గండం ఖాళీరో
ఓరోరి కొబ్బరిబొండాం ఐతే మా ఊరికి గండం ఖాళీరో
పడతాం నీ పాశం హాం.. హాం... హాం.. హాం...
తీస్తాం నీ మైకం వెల్కం వెల్కం వెల్కం వెల్కం
పడతాం నీ పాశం కకకక్కకం కంకం కంకం
తీస్తాం నీ మైకం దదద్దిగుదిగు దగదిగుదోం
పగపడతాం పనిపడతాం చెరబడతాం తకదిమి తకదిమి తకదిమి
పగపడతాం పనిపడతాం చెరబడతాం తకదిమి తకదిమి తకదిమి
కొలువైనాడే కోట్ల విలువైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయడే
కొలువైనాడే కోట్ల విలువైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయడే
చరణం 3 :
ఈ నారికేళుని చోరగాథలు వీనుల వినుడు
తందానతాన తానతందన
కొబ్బరిలంకలో గొప్పగా కొలువైన కొత్త లంకేశ్వరుడి గోలగాథలు మీరు
హో హో హో హో
రక్షకభటుల తోడ న్యాయవాదుల తోడ మంత్రిమాన్యుల తోడ చిత్రగుప్తుల తోడ
దర్పాలు మీర దర్బారు సేయు దర్జాలు చూడ తరమా మా తరమా ఆయ్...
తరమా మా తరమా
అయ్యో కోకాసురుడే కోట్ల బాకాసురుడే మా కొబ్బరికాయల సుబ్బారాయడే
అయ్యో కోకాసురుడే కోట్ల బాకాసురుడే మా కొబ్బరికాయల సుబ్బారాయడే
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9018
No comments:
Post a Comment