Tuesday, November 3, 2020

తామర పువ్వంటి తమ్ముడు కావాలా

 




చిత్రం : బంగారు కానుక (1982)

సంగీతం :  సత్యం

గీతరచయిత :

నేపథ్య గానం : బాలు, సుశీల 



పల్లవి :


తామర పువ్వంటి తమ్ముడు కావాలా 

చామంతి పువ్వంటి చెల్లాయి కావాలా

తామర పువ్వంటి తమ్ముడు కావాలా 

చామంతి పువ్వంటి చెల్లాయి కావాలా


ఈ మహరాణి నా గృహరాణి

ఈ మహరాణి నా గృహరాణి

దయ ఉంచి ఇద్దర్ని ఇవ్వాలా

తామర పువ్వంటి తమ్ముడు కావాలా 

చామంతి పువ్వంటి చెల్లాయి కావాలా


చరణం 1 :


ఇల్లేలే ఇల్లాలు వెదజల్లే అందాలు

కలబోసిన అమ్మాయి ఈ ఏడే పుట్టాలి

నన్నేలే శ్రీవారు మురిపించే సరసాలు

మరిపించే అబ్బాయి తమ భరతం పట్టాలి


మా అమ్మలు ఆటకి అమ్మా నాన్న బొమ్మలు కావాలి

అమ్మా నాన్న నాకో తమ్ముడు ఇప్పుడే కావాలి


తామర పువ్వంటి తమ్ముడు కావాలా 

చామంతి పువ్వంటి చెల్లాయి కావాలా



చరణం 2 :


మా పాపే యువరాణి... మా ఇల్లే ఒక రాజ్యం

ఆ మాటే ధర్మానా... కాదంటే జరిమాణా

కంటావా మహరాణి... కావాలి ఒక సైన్యం

పెద్దైనా చినదానా... నీ ప్రేమే నజరానా 


ఇద్దరు లేకా ముగ్గురన్నది హద్దు ఎవరికైనా

ముద్దుల తమ్ముని ఇవ్వక పోతే మీకే జిల్లాయి


తామర పువ్వంటి తమ్ముడు కావాలా 

చామంతి పువ్వంటి చెల్లాయి కావాలా

ఈ మహరాణి నా గృహరాణి

దయ ఉంచి ఇద్దర్ని ఇవ్వాలా

నా మదినేలే ఈ మహరాజు 

దయ ఉంటే ఇద్దర్ని ఇస్తానే


తామర పువ్వంటి తమ్ముడు కావాలా 

చామంతి పువ్వంటి చెల్లాయి కావాలా



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6644

No comments:

Post a Comment