Wednesday, November 4, 2020

కసురుకున్న కళ్ళది




చిత్రం : బంగారు కానుక (1982)

సంగీతం :  సత్యం

గీతరచయిత : వేటూరి 

నేపథ్య గానం : బాలు, సుశీల 



పల్లవి :


కసురుకున్న కళ్ళది పెసరకాయ వేళ్ళది

కసురుకున్న కళ్ళది పెసరకాయ వేళ్ళది

ఏమౌతాదో ఏమో వస్తే కౌగిళ్ళకి

ఇ.. ఇ.. ఇ.. ఇ.. ఇ.. ఇ.. 

పూలా పొదరిళ్ళకి... పూలా పొదరిళ్ళకి


ఉడుం పట్టు పిల్లడు.. ఊరికంత అల్లుడు

ఉడుం పట్టు పిల్లడు.. ఊరికంత అల్లుడు

ఏమిస్తాడో ఏమో వస్తే కౌగిళ్ళకి

అహా హా...  హా  

పూలా పొదరిళ్ళకి... హా.. పూలా పొదరిళ్ళకి



చరణం 1 :


పిసినిగొట్టు నడుమ్మీద పిలక జళ్ళది

విసిరిగొట్టు కొంగుల్లో పొంగే పరవళ్ళది

పిసినిగొట్టు నడుమ్మీద పిలక జళ్ళది

విసిరిగొట్టు కొంగుల్లో పొంగే పరవళ్ళది


సెలయేటి ఉరవళ్ళది... చలిగాలి సణుగుళ్ళది

ఆ...ఆ...

సెలయేటి ఉరవళ్ళది... చలిగాలి సణుగుళ్ళది

ఏమొతాదో ఏమో ఎండా ఎన్నళ్ళకి... అహా.. ఏయ్

చీరాసందిళ్ళకి... తీపీ సందిళ్ళకి 


కసురుకున్న కళ్ళది పెసరకాయ వేళ్ళది

ఏమిస్తాడో ఏమో వస్తే కౌగిళ్ళకి

అహా హా...  హా  

పూలా పొదరిళ్ళకి... హా.. పూలా పొదరిళ్ళకి


చరణం 2 :


చెంత కొచ్చి చేయి పడితే ఇంక చెల్లడు

బుగ్గ గట్టి చేతికిస్తే మొగ్గైనా గిల్లడు 

చెంత కొచ్చి చేయి పడితే ఇంత చెల్లడు  

బుగ్గ గట్టి చేతికిస్తే మొగ్గైనా గిల్లడు 


సరసాల ఈ గుంటడు... సరదాకి బాగుంటడు

సరసాల ఈ గుంటడు... సరదాకి బాగుంటడు


ఏమిస్తాడో ఏమో నా ఇరవై ఏళ్ళకి

హా.. హా.. హా

చీరా కుచ్చిళ్ళకి.. హా.. చిలిపి వత్తిళ్ళకి



ఉడుం పట్టు పిల్లడు.. ఊరికంత అల్లుడు

ఏమౌతాదో ఏమో వస్తే కౌగిళ్ళకి 

హా.. హా...

పోదాం సందేళకి.. పూలా పొదరిళ్ళకి 



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1876

No comments:

Post a Comment