చిత్రం : హరే కృష్ణ హల్లో రాధ (1980)
సంగీతం : విజయ భాస్కర్
గీతరచయిత :
నేపథ్య గానం : బాలు, వాణీజయరామ్
పల్లవి :
చలాకిరాజా స్వాగతం... చలించె నా తొలిపరువం
వరించె నిన్నే హృదయం... వేయి జన్మల ప్రణయం
ఇది వయసు రాసిన కావ్యం
వరాలరాణి స్వాగతం... ఫలించె నేటికి పరువం
వరించె నిన్నె హృదయం... వయసు నేర్చిన ప్రణయం
ఇది వలపు రాసిన కావ్యం
చరణం 1 :
నిన్న పూచే మిలమిలమిలమనె కన్నెమందారం
నేడు మెరిసె తళతళతళమని రాగసిందూరం
నిన్న పూచే మిలమిలమిలమనె కన్నెమందారం
నేడు మెరిసె తళతళతళమని రాగసిందూరం
కాళిదాసుని కన్యవో... ఆంధ్రనాయకి ఎంకివో
నిండువెన్నెల రేఖవో... వలపుతేనెల వాకవో
నేను నీదానను...
వరాలరాణి స్వాగతం... ఫలించె నేటికి పరువం
వరించె నిన్నె హృదయం...
చరణం 2 :
పొంగిపొరలె జలజలజలమని ప్రేమ వాహినులే
పాడుతున్నవి సరిగమస్వరముల మోహ వేణువులే
పొంగిపొరలె జలజలజలమని ప్రేమ వాహినులే
పాడుతున్నవి సరిగమస్వరముల మోహ వేణువులే
మేలుకొన్నది యవ్వనం మేలమాడె మగతనం
ఆగనన్నది కోరిక కోరుతున్నది వేడుక
అందుకో కానుక... హహ..
చలాకిరాజా స్వాగతం... చలించె నా తొలిపరువం
వరించె నిన్నే హృదయం...
వయసు నేర్చిన ప్రణయం
ఇది వలపు రాసిన కావ్యం
లలలలలల.. లలలలలలల...
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3985
No comments:
Post a Comment