Saturday, December 19, 2020

వలపు గువ్వల జంటలు





చిత్రం :  హరే కృష్ణ హల్లో రాధ (1980)
సంగీతం :  విజయ భాస్కర్
గీతరచయిత :  
నేపథ్య గానం :  బాలు, వాణీజయరామ్, సుశీల, రామకృష్ణ



పల్లవి : 


వలపు గువ్వల జంటలు పలికె తియ్యని కవితలు

ఊహకందని ఊసులు భాష ఎరుగని బాసలు

                     
చరణం 1 :


ఇదో యవ్వన తరంగం... ఇదే మోహన విహంగం                     
రాగం సరాగం శృంగార విలాసం ... ఇదే రాజయోగం
ప్రియుని ఒడిలో ప్రేయసి... చెలుని కనులకు ఊర్వశి 


వలపు గువ్వల జంటలు పలికె తియ్యని కవితలు

ఊహకందని ఊసులు భాష ఎరుగని బాసలు


                         
చరణం 2 : 


ఇదే పూచిన గులాబి...  తనే వలపుల షరాబి
మోహం వ్యామోహం ... ఊగించే విరహం... ఇదో ప్రేమ మైకం
మరులు మధువులు కురియగ... తనువులొకటై తడియగ


వలపు గువ్వల జంటలు పలికె తియ్యని కవితలు

ఊహకందని ఊసులు భాష ఎరుగని బాసలు


చరణం 3 :


ఇలా కౌగిట బిగింప... సుతారంగా స్పృశింప
ఒకే సిగ్గున వొదిగి వొదిగి... వొదిగి వొదిగి
వయ్యారంగా జరిగి జరిగి... జరిగి జరిగి
శరీరాలే దహించ రతిపతియే జయించ


వలపు గువ్వల జంటలు పలికె తియ్యని కవితలు

ఊహకందని ఊసులు భాష ఎరుగని బాసలు


చరణం 4 :


కనుల కోర్కెలు జ్వలించ... కన్నెమనసె చలించ
వినోదంలో మునిగి మునిగి... మునిగి మునిగి
విరోధుల్లా పెనగి పెనగి... పెనగి పెనగి
సదావిరిసే వసంతం... ఇదే ప్రణయము అనంతం


వలపు గువ్వల జంటలు పలికె తియ్యని కవితలు

ఊహకందని ఊసులు భాష ఎరుగని బాసలు

వలపు గువ్వల జంటలు పలికె తియ్యని కవితలు



No comments:

Post a Comment