Friday, December 18, 2020

మంచుతెరలలోనా మల్లెపూలవానా

 



చిత్రం :  హరే కృష్ణ హల్లో రాధ (1980)

సంగీతం :  విజయ భాస్కర్

గీతరచయిత :  

నేపథ్య గానం :  బాలు, వాణీజయరామ్



పల్లవి : 


మంచుతెరలలోనా... మల్లెపూలవానా

పడుచుగుండెలోనా... పలికె మోహవీణా

రేగింది తియ్యని జ్వాలా... సాగింది మన్మధ లీల


మంచుతెరలలోనా... మల్లెపూలవానా

పడుచుగుండెలోనా... పలికె మోహవీణా

రేగింది తియ్యని జ్వాలా... సాగింది మన్మధ లీల



చరణం 1 :


నీలో కనుచెదరే సొగసులనే  చూశా

నేడె చిరుపెదవుల చిరునామా రాశా


నీపై కథలువిని కలలుగని వేచా

నేడే తొలివయసున వలపు తలపు తీశా


హాయిమీరా చెలితో షికారు

కన్నెమదిలో కలిగెను హుషారు

మనసుపాడె వలపుల జోలా

సాగింది మన్నధలీల


మంచుతెరలలోనా... మల్లెపూలవానా


చరణం 2 :


నింగి తెలిమబ్బుల తెరచాపలు వేసె

వంగి మనవలపుల తొలికలయిక  చూసె


రాలే కుసుమాలె మనయిరువురి వైపు

పరిచె ప్రణయానికి అనువైన పాన్పు


చల్లగాలి ఉాదెను సన్నాయి

వెచ్చని పొదరిళ్లు స్వాగతమన్నాయి

జగమె వేసెమనకు ఉయ్యాలా

సాగింది మన్మధలీల


మంచుతెరలలోనా... మల్లెపూలవానా



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3986

No comments:

Post a Comment