చిత్రం : అన్న తమ్ముడు (1958)
సంగీతం : అశ్వత్థామ
గీతరచయిత : ఆచార్య బి.వి.ఎన్
నేపథ్య గానం : జిక్కి
సంగీతం : అశ్వత్థామ
గీతరచయిత : ఆచార్య బి.వి.ఎన్
నేపథ్య గానం : జిక్కి
పల్లవి :
మ్రోగింపవే హృదయ వీణ...
పలికింపవే మధుర ప్రేమ...
మ్రోగింపవే హృదయ వీణ
మృదుల మనోహర నాదముతో...
మృదుల మనోహర నాదముతో...
జీవితఫలమే ప్రేమయనీ...
అది కామితములలో మిన్నయని
మ్రోగింపవే హృదయవీణా...
చరణం 1 :
సతిపతులను విరజాజిపువ్వులో
ప్రేమతావివై... పరిమళించుగా
సతిపతులను విరజాజిపువ్వులో
ప్రేమతావియై పరిమళించుగా
హృదయభారమును తీర్చి దంపతుల
మనసులొకటిగా మార్చును ప్రేమా...
మ్రోగింపవే హృదయవీణా..
చరణం 2 :
ఎవరెవరో మది ఎరుగకున్ననూ
ఎదలో కదులును తీయనిబాధా..
ఎవరెవరో మది ఎరుగకున్ననూ
ఎదలో కదులును తీయనిబాధా
ప్రేమ ఎరుగదా తనవారెవరో
ప్రేమను బోలిన పెన్నిధిగలదా
మ్రోగింపవే హృదయవీణా..
చరణం 3 :
అనుబలమున పరిపాలన జేసెడి
మనుజరాక్షసుల మతములు మాపి
అనుబలమున పరిపాలనజేసెడి
మనుజరాక్షసుల మతములు మాపి
విశ్వమానవుల కల్యాణానికి
నాందీగీతమై అలరును ప్రేమా...
మ్రోగింపవే హృదయ వీణ...
పలికింపవే మధుర ప్రేమ...
మ్రోగింపవే హృదయ వీణ
No comments:
Post a Comment