Friday, January 8, 2021

గలగలమని నవ్వకే


చిత్రం :  గాలి వాన (1979)
సంగీతం :   పెండ్యాల
గీతరచయిత :  కొంపెల్ల శివరాం
నేపథ్య గానం :  బాలు, సుశీల 


పల్లవి : 


హ..హ.. హ..
గలగలమని నవ్వకే... సొగసు కరిగిపోతుంది
గలగలమని నవ్వకే... సొగసు కరిగిపోతుంది
చిలిపి కళ్ళు మూయకే... చీకటి పడిపోతుంది
నీ చిలిపి కళ్ళు మూయకే... చీకటి పడిపోతుంది

గుండె తలుపు తట్టకు... కోర్కె రేగిపోతుంది
గుండె తలుపు తట్టకు... కోర్కె రేగిపోతుంది
కొంగు బట్టి లాగకు... వలపు వొలికిపోతుంది
నా కొంగు బట్టి లాగకు... వలపు వొలికిపోతుంది

ఆ.. హహ.. ఆఅ.. హహ.. ఆ... ఆ.. హహహ


చరణం 1 :
 

నదిలా నువు నడచినంత మేరా... అ... ఆ.. ఆ..
భూదేవి ఆకు పచ్చ చీరా
నదిలా నువు నడచినంత మేరా... అ... ఆ.. ఆ..
భూదేవి ఆకు పచ్చ చీరా

చీరల్లే నను నిలువు చుట్టుకోకు.. దండాలు ఓ మేనబావ నీకు

ఏం సిగ్గా.. ఉమ్మ్.. హహహ...


గలగలమని నవ్వకే.. సొగసు కరిగిపోతుంది
చిలిపి కళ్ళు మూయకే.. చీకటి పడిపోతుంది


చరణం 2 :


తొలి వెన్నెల మాలలల్లుకున్నా... నీ చల్లని నీడ కోరుకున్నా
తొలి వెన్నెల మాలలల్లుకున్నా... నీ చల్లని నీడ కోరుకున్నా

చలిగాలితో కబురులంపుతున్నా... నీ రూపే మదిని నిలుపుకున్నా
చలిగాలితో కబురులంపుతున్నా... నీ రూపే మదిని నిలుపుకున్నా

అలాగా... హహహా

గలగలమని నవ్వకే.. సొగసు కరిగిపోతుంది
చిలిపి కళ్ళు మూయకే.. చీకటి పడిపోతుంది


గుండె తలుపు తట్టకు.. కోర్కె రేగిపోతుంది
నా కొంగు బట్టి లాగకు... వలపు వొలికిపోతుందిNo comments:

Post a Comment