Thursday, January 21, 2021

మనమే నందన వనమౌ కాదా





చిత్రం :  మా ఇంటి మహాలక్ష్మి (1959)
సంగీతం :   అశ్వత్థామ
గీతరచయిత :  మల్లాది
నేపథ్య గానం :  జిక్కి 



సాకి : 


తన కన్నవారికి జనని ఆశా జ్యోతీ

సంసార నౌకకు జనని ధృవతారా

కనుచాటు కానీ ఎడబాటు లేదనీ  

అనుబంధము శాశ్వతమని భావించినా



పల్లవి :


మనమే నందన వనమౌ కాదా 

మనమే నందన వనమౌ కాదా 

కనుపండువుగా... తనవారందరు

కలసి మెలసి కళ కళలాడా

మనమే నందన వనమౌ కాదా 


చరణం 1 :


లేలేత హృదయానా లాలింపు చిరునవ్వే

ఇల్లాలికీ... సుమ మాలనై

తనువుగ చనువుగ  మనమున అనురాగముతో

పసి పాపలై... కనుపాపలైనా


మనమే నందన వనమౌ కాదా 


చరణం 2 :


కలతలు లేనీ కలిమి మాదనీ

మాయని మారని మమత మారని

ఎవగలైనా... ఎన్నటికైనా

ఎవ్వరి కెవ్వరు వేరు కారనీ

అందర మొకటై వెన్నెల నీడలు

హాయిగా హాయిగా కలకాలము మననిన


మనమే నందన వనమౌ కాదా 

కనుపండువుగా... తనవారందరు

కలసి మెలసి కళ కళలాడా

మనమే నందన వనమౌ కాదా 




No comments:

Post a Comment