Friday, January 29, 2021

ఎవరో ఎవరో నీ వాడు

చిత్రం :  తేనె మనసులు (1965)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : సుశీల 

పల్లవి:

తెల్లని వన్నెదానా... విరి తేనియలూరు మనస్సు దానా
నీ వెళ్ళిన దారిలోన విను వీధిని.. భూమిని.. సాగరానా
నా వల్లభుదెచ్చటైన కానవచ్చెనే? 
వేదన తీర నీకు యే చల్లని మాట చెప్పమనే? 
చప్పున చెప్పవె రాజ హంసమా...  

ఆది పురాణ యుగము దమయంతి 
నాడు భాషలన్నియు తెలిసినవారు వారు 
నేను నీ భాష తెలియనిదాన గాన 
మనిషి భాషలో మావారి మాట చెపుమ

ఎవరో ఎవరో నీ వాడు... ఎరుగను ఎరుగను నీ తోడు 
ఎవరో ఎవరో నీ వాడు... ఎరుగను ఎరుగను నీ తోడు
ఎవరో ఎవరో నీ వాడు... ఎరుగను ఎరుగను నీ తోడు

చరణం 1 :

చుక్కల వీధిన వస్తుంటే... తారల ఊసులు విన్నానే 
చుక్కల వీధిన వస్తుంటే... తారల ఊసులు విన్నానే 
కలువుల కన్నులు గలవాడు...  చలువుల మనసే గలవాడు 
వెన్నెల నవ్వుల వెలెగేవాడు... వస్తున్నాడని అన్నారే ? 

వాడే నీవాడా ? వాడే నీవాడా ? 

వాడే నీవాడా ? వాడే నీవాడా ? ... 
ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. 

ఎవరో ఎవరో నీ వాడు... ఎరుగను ఎరుగను నీ తోడు

చరణం 2 :

నీటి బాటలో వస్తుంటే... నదీ కన్యల నాట్యం చూశా 
నీటి బాటలో వస్తుంటే... నదీ కన్యల నాట్యం చూశా 
పొంగే బంగరు ప్రాయం వాడూ... అలలె హారంగా కలవాడు 
అంతు దొరకనీ హృదయం వాడు... వస్తున్నాడని అన్నారే ? 

వాడే నీవాడా ? వాడే నీవాడా ? 
వాడే నీవాడా ? వాడే నీవాడా ?..
 ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. 

ఎవరో ఎవరో నీ వాడు... ఎరుగను ఎరుగను నీ తోడు

చరణం 3:

పూలవాడలో వస్తుంటే...  మల్లె జాజి మందారం 
పూలవాడలో వస్తుంటే...  మల్లె జాజి మందారం
నే ముందుంటే... నే ముందుంటూ... తగవులాడగా విన్నానే 
తేనెలు దోచే తీయని వాడు... వస్తున్నాడని అన్నారే ?  

వాడే నీవాడా ? వాడే నీవాడా ? 
వాడే నీవాడా ? వాడే నీవాడా ? ...ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. 

ఎవరో ఎవరో నీ వాడు... ఎరుగను ఎరుగను నీ తోడు 
ఎవరో ఎవరో నీ వాడు... ఎరుగను ఎరుగను నీ తోడు

https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7062

No comments:

Post a Comment