Tuesday, February 2, 2021

పురుషుడు నేనై పుట్టాలి

చిత్రం :  తేనె మనసులు (1965)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం : సుశీల, ఘంటసాల, పి. బి. శ్రీనివాస్

పల్లవి :

పురుషుడు నేనై పుట్టాలి... ప్రకృతి నీవే రావాలి

ఇరువురి మనసులు కలవాలి...

ఆ కలయిక కళకళలాడాలి

పుడమే నేనై పుట్టాలి... ఒడిదుడుకులను ఓర్వాలి

కడలిని నదినీ కలపాలి... ఆ కలయిక కళకళలాడాలి

చరణం 1 :

మెరమెరలాడే వయసు నేనై... మిసమిసలాడే సొగసు నీవై

వెల్లువలాగా వెన్నెలలాగా... ముల్లోకాలను ముంచాలి

వెల్లువలాగా వెన్నెలలాగా... ముల్లోకాలను ముంచాలి

పుడమే నేనై పుట్టాలి... ఒడిదుడుకులను ఓర్వాలి

కడలిని నదినీ కలపాలి... ఆ కలయిక కళకళలాడాలి

చరణం 2 :

పైమెరుగులకే ఉరకలువేసే... పరువానికి పగ్గం వేసి

పగ్గం కట్టిన కన్నె మనసులో... లోతులు తెలిసి మసలాలి

పగ్గం కట్టిన కన్నె మనసులో... లోతులు తెలిసి మసలాలి

పురుషుడు నేనై పుట్టాలి... ప్రకృతి నీవే రావాలి

కడలిని నదినీ కలపాలి... ఆ కలయిక కళకళలాడాలి

దేవుడు నేనై పుట్టాలి... దేన్నో తాన్నో ప్రేమించి 

ఆడదాని మనసంటేనే... విషమని తెలిసి ఏడ్వాలి

చరణం 3 :

గాజు వంటి హృదయం తనది... రాతి వంటి నాతికి తగిలి

ముక్కలు చెక్కలుగా పగిలి... నెత్తురు కన్నీరవ్వాలి

దేవుడు నేనై పుట్టాలి... దేన్నో తాను  ప్రేమించి

ఆడదాని మనసంటేనే... విషమని తెలిసి ఏడ్వాలి

విషమని తెలిసి ఏడ్వాలి

https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7064

No comments:

Post a Comment